Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పంచమి తిథి.. వరాహి దేవికి కొబ్బరి దీపం వేస్తే?

పంచమి తిథి.. వరాహి దేవికి కొబ్బరి దీపం వేస్తే?
, సోమవారం, 28 జూన్ 2021 (09:52 IST)
పంచమి తిథిలో వరాహి దేవికి కొబ్బరి దీపాన్ని వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కొబ్బరి పగుల కొట్టి అందులోని నీటిని వేరు చేసి.. కొబ్బరిలో నేతిని పోయాలి. ఎరుపు రంగు వత్తులను వాడాలి. ఈ దీపాన్ని ఓ ప్లేటుపై బియ్యాన్ని పరిచి దానిపై వెలిగించాలి. 
 
పువ్వులతో, పసుపు కుంకుమలతో దీపాన్ని అలంకరించుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న కొబ్బరి దీపాన్ని పంచమి తిథి అయిన సోమవారం (28 జూన్) రాత్రి 8 గంటల నుంచి 9 గంటల్లోపు వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ దీపాన్ని ఆలయాల్లో వెలిగించడం ఉత్తమం. 
 
కానీ కరోనా కాలం కావడంతో ఇంట్లోనే వెలిగించి.. ఆ దీపాన్ని కొబ్బరిని మరుసటి రోజు పారే నీటిలో కలిపేయాలి. ఇలా చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ప్రతికూలతల ప్రభావం వుండదు. సానుకూల శక్తిని పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ఇంట తెలుపు ఆవాలు, పచ్చకర్పూరంతో కలిపి ధూపం వేయడం మరువకూడదు. ఆపై పానకం నైవేద్యంగా సమర్పించవచ్చు. 
 
పంచమి తిథిలో వరాహి దేవిని ఇలా పూజిస్తే సమస్త దోషాలుండవు. పౌర్ణమి, అమావాస్య ముగిసిన ఐదో రోజున వరాహి దేవిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ తిథి మహత్తరమైనది. సప్తకన్యల్లో వరాహి దేవి ఒకరు.
 
మనం చేసే కార్యాలు దిగ్విజయం కావాలంటే.. కార్యసిద్ధి కోసం వరాహి దేవిని పూజించడం ఉత్తమం. అదీ పంచమి తిథిలో వరాహి దేవి స్తుతితో అనుకున్న కోరికలు తీరుతాయి. ఆ రోజున వ్రతమాచరించి పూజిస్తే.. రుణబాధలుండవు. ఆర్థిక సమస్యలుండవు. వయోబేధం లేకుండా పంచమి తిథి రోజున వరాహి దేవి కోసం వ్రతమాచరించవచ్చు.
 
అయితే పంచమి తిథిలో జన్మించిన వారికి ఈ తిథిన వరాహి దేవి పూజ ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఇంకా పంచమి తిథిలో జన్మించిన జాతకులు పుట్టకు పాలు పోయడం.. వరాహి దేవిని పూజించడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది.
 
ఇంకా ఐదు నూనెలను కలగలిపి.. ఆమెకు దీపం వెలిగిస్తే సకలసంపదలు వెల్లివిరుస్తాయి. ఈ దీపానికి ఎరుపు వత్తులను వాడటం మంచిది. నైవేద్యంగా పొట్టు తీయని మినపప్పుతో తయారు చేసిన గారెలు లేకుంటే నవధాన్యాలతో చేసిన గారెలను, పెరుగన్నం, శెనగలు, పానకం వంటివి సమర్పించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28-06-2021 సోమవారం దినఫలాలు - శంఖరుడిని పూజించినా...