Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓటీటీలోకి 'తెల్లవారితే గురువారం'.. ఆకట్టుకుంటుందా..?

Advertiesment
ఓటీటీలోకి  'తెల్లవారితే గురువారం'.. ఆకట్టుకుంటుందా..?
, సోమవారం, 12 ఏప్రియల్ 2021 (16:32 IST)
Thellavarithe Guruvaram
వారాహి చిత్రం నిర్మించిన 'తెల్లవారితే గురువారం' సినిమా గత నెల 27న విడుదలై అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడీ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. కీరవాణి కుమారుడు సింహా హీరోగా మణికాంత్ దర్శకత్వంలో చిత్రాశుక్లా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు కీరవాణి మరో కుమారుడు కాలభైరవ సంగీతం అందించారు. 
 
సినిమా విడుదలైన 19 రోజులకే అంటే ఈ నెల 16న ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్లలో ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమా ఓటీటీలోనైనా అలరిస్తుందేమో చూడాలి. 
 
లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మించారు. రాజీవ్‌ కనకాల, సత్య, అజయ్‌, వైవా హర్ష కీలకపాత్రలు పోషించారు. కాలభైరవ సంగీతం అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థియేట‌ర్లు బంద్ దిశ‌గా తెలుగు ప‌రిశ్ర‌మ‌