నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవని తెలుసుకో

Webdunia
మంగళవారం, 25 మే 2021 (23:21 IST)
ఆదర్శం గల వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే, ఏ ఆదర్శం లేని వ్యక్తి ఏభై వేల తప్పులు చేస్తాడనడం నిస్సంశయం. కాబట్టి ఒక ఆదర్శం కలిగి ఉండటం మంచిది.
 
విశ్వాసం, సౌశీల్యం గల ఆరుగురు వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. మనకు కావలసినవి మూడు-ప్రేమించే హృదయం, భావించే మనస్సు, పని చేసే చెయ్యి.
 
వేయి ఓటములనైనా ఓర్చుకొని, పట్టు వదలకుండా ప్రయత్నించినప్పుడే సద్గుణాలను, శీలసంపత్తిని సమకూర్చుకోగలం.
 
ఆత్మ యెుక్క ఈ అనంతశక్తిని భౌతిక ప్రపంచం మీదకి ప్రసరింపజేస్తే అది భౌతిక సంపదలను ఇస్తుంది. ఆలోచనా విధానంపై ప్రసరింపజేస్తే బుద్దిని వికసింపజేస్తుంది. మనస్సు మీద మనస్సునే పని చేయిస్తే మనిషి దేవుణ్ణి చేస్తుంది.
 
లేచి నిలబడు, ధైర్యంగా బలిష్టంగా ఉండు. మెుత్తం బాధ్యతనంతా నీ భుజస్కంధాల మీదనే వేసుకో. నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవని తెలుసుకో. నీకు కావలసిన బలం, శక్తి.... అన్నీ నీలోనే ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమ్మాయితో డేటింగ్‌కు వెళితే.. కిడ్నాప్ చేసి రూ.7 లక్షలు దోచుకున్నారు..

రేవంత్ ముందు మీ ఆటలు సాగవు... బీఆర్ఎస్ సభ్యులకు సీఎం వార్నింగ్ - సభ్యుల సస్పెన్షన్

పల్నాడులో మూడేళ్ల కుమార్తెతో కలిసి వైద్యుడి కుటుంబం ఆత్మహత్య

తెలంగాణాలో మాంసం ప్రియులకు షాక్... చికెన్ దుకాణాలు బంద్...

కారు డ్రైవర్ కుమారుడికి టిక్కెట్ ఇచ్చిన హీరో విజయ్ (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీరామనవమి రోజున ఈ రాశుల వారికి అంతా శుభం

శ్రీరామనవమి రోజున సుందరకాండను చదివితే..?

26-03-2026 గురువారం ఫలితాలు - పొగడ్తలకు పొంగిపోవద్దు

25-03-2026 బుధవారం ఫలితాలు-దంపతుల మధ్య అకారణ కలహం

24-03-2026 మంగళవారం ఫలితాలు - ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు

తర్వాతి కథనం
Show comments