గురువు చెప్పాడని ఎదురుగా వచ్చిన స్త్రీని సంహరించిన రాముడు...

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (22:12 IST)
ఎన్నో జన్మల పుణ్యం వలన మానవజన్మ వస్తుంది. ఈ మానవజీవితం సార్ధకం కావాలి అంటే గురువును గురించి తెలుసుకోవాలి. గురువే తల్లి, తండ్రి, దైవం. గురువును మించిన దైవం లేదు. గురువు వాక్కే వేదవాక్కు. గురువు వాక్కును శిరసావహించిన వారిని చూసి శివకేశవులు కూడా ఎంతో సంతోషిస్తారు. 
 
బాలకాండలో గురువు ఆజ్ఞను గురించి ఇలా చెప్పబడింది. యాగసంరక్షణార్ధం రామలక్ష్మణులు అడవిలో విశ్వామిత్ర మహామునిని అనుసరించి వెడుతున్న సమయంలో విశ్వామిత్ర మునికి తమకెదురుగా ఒక స్త్రీ రావడం కనపడింది. విశ్వామిత్రులవారు రామునితో ఆమెను ఒక్క బాణంతో చంపమని ఆజ్ఞాపించారు.
 
తమకు అపకారం చేయని ఒక స్త్రీని చంపడం పాపమని రాముడు మెుదట సందేహించాడు. ఒక్క క్షణమాగి, తరువాత గురువు ఆజ్ఞను పాలించడమే ముఖ్య కర్తవ్యమని తలంచి బాణానెక్కుపెట్టి ఒక్క బాణంతో ఆ స్త్రీని వధించినాడు. తరువాత ఆ స్త్రీ తాటకి అనే రాక్షసి అని తెలుసుకున్నాడు. శ్రీరాముడు మరేమీ ప్రశ్నించకుండా తన గురువు యెుక్క ఆజ్ఞను పాలించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి ఇక అజేయం.. ఆంధ్రులకు గర్వకారణం.. పవన్ కల్యాణ్

ఆ పెయింటింగులలో ప్రాణాలున్నాయా? రాజా రవివర్మ పెయింటింగ్ రూ. 167 కోట్లు

తిరుమల, రెండో ఘాట్ రోడ్డు.. సుమో వాహనంలో నిప్పులు

AP Thanks India, ఒక రాష్ట్ర రాజధానికి కేంద్రం చట్టబద్ధత ఇదే తొలిసారి, చంద్రబాబు పూజలు

అమెరికాను వణికిస్తున్న 'సికాదా' - భారత్‌లోకి ఎంట్రీ కానుందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

01-04-2026 నుంచి 30-04- 2026 వరకు మాస ఫలితాలు- సత్కాలం సమీపిస్తుంది..

31-03-2026 మంగళవారం ఫలితాలు - తప్పులు దొర్లే ఆస్కారం ఉంది..

30-03-2026 సోమవారం ఫలితాలు - మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది...

29-03-2026 ఆదివారం ఫలితాలు- రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు..

29-03-2026 నుంచి 04-04-2026 వరకు మీ వార ఫలితాలు- ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి..?

తర్వాతి కథనం
Show comments