Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీసాయినాధుడు అందుకే అవతరించాడు...

ఇంద్రియాలకు, మనస్సుకు అతీతమైన పరమాత్మ ఉన్నాడనీ, తినడం, నిద్రపోవడం వంటి ప్రాకృతికమైన క్రియలకంటే జీవితానికి వేరొక పరమార్ధమున్నదని, దానిని పొందేందుకు సాధన ఒకటున్నదనీ మానవ జాతికి తెల్పినవారు లేకుంటే మనమంతా పశుప్రాయంగా జీవిస్తుండేవాళ్లమే.

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (21:08 IST)
మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాము. ఆ కష్టం తొలగినపుడు భగవంతుడిని సంతోషంగా కొలుస్తాము. కాని ఆ సమస్య తీరనప్పుడు ఒక దేవతను వదిలి ఇంకొక దేవుణ్ణి, ఒక గురువును వదిలి ఇంకొక గురువును, ఒక సాంప్రదాయాన్ని వదిలి ఇంకొక సాంప్రదాయాన్నిఆశ్రయిస్తుంటారు.


కొంతకాలం ఆ క్రొత్తదనం వలన ప్రయోజనమున్నట్లనిపించినా, మరికొంతకాలానికి వారి సమస్య సమస్యగానే నిలిచిపోతుంటుంది. వీరిలో కొందరు అసలు సాధన, ఆధ్యాత్మికతలే వాస్తవంకాదనే దృష్టికొస్తారు. అలానే ప్రాపంచిక సమస్యల విషయంలోనూ జరుగుతూంటుంది. ఈ సమస్యకు కారణం మనం ప్రధానమైన ఒక సత్యాన్ని మరవడమే.
 
ఇంద్రియాలకు, మనస్సుకు అతీతమైన పరమాత్మ ఉన్నాడనీ, తినడం, నిద్రపోవడం వంటి ప్రాకృతికమైన క్రియలకంటే జీవితానికి వేరొక పరమార్ధమున్నదని, దానిని పొందేందుకు సాధన ఒకటున్నదనీ మానవ జాతికి తెల్పినవారు లేకుంటే మనమంతా పశుప్రాయంగా జీవిస్తుండేవాళ్లమే. అలా తెల్పినవారిని సద్గురువులంటారు. భగవంతుని అస్థిత్వాన్ని తాము ప్రత్యక్షంగా అనుభవించి మనకు నిస్సంశయంగా ఆ విషయాన్ని నిరూపించి, దానిని పొందే మార్గాన్ని స్వానుభవంతో భోధించేవారిని సద్గురువులు అంటారు. బ్రహ్మజ్ఞానియైన సద్గురువును ఆశ్రయించి తీరాలని లోకానికి అవతార పురుషులు నొక్కి చెప్పారు. మన మాచరించితీరవలసిన మార్గాన్ని తన ఆచరణ ద్వారా చూపిన శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుణ్ణి గురువుగా ఆశ్రయించాడు. 
 
తాను ఏవిధమైన యత్నంతోనూ పొందదగినదేదీ ముల్లోకాల్లోనూ లేదని భగవద్గీతలో చెప్పిన శ్రీ కృష్ణపరమాత్మ బాల్యంలో తన నోట చతుర్దశభువనాలనూ, యశోదకు దర్శనమిచ్చిన శ్రీకృష్ణుడు సాందీపుని మహర్షికి శిష్యుడై సేవించాడు. అందుకు కారణాన్ని భగవద్గీతలో యద్యదాచరతి శ్రేష్టః తత్త దేవే తరోజనాః శ్రేష్టుడు దేనినాచరించిన, దానినే ఇతర జనులాశ్రయిస్తారని చెప్పాడు. కృష్ణుడు తాను ఆచరించి చూపడమే కాక ప్రాణప్రియుడైన అర్జునికి కూడా అలానే చేయమని చెప్తాడు. గురువుని సేవించడం వల్ల మనం దేవతారాధన ఎలా చేయాలో, కర్మల నుండి ఎలా బయట పడాలో తెలుసుకోగలుగుతాము. మనం తెలిసి తెలియక చేసే కర్మల నుండి రక్షించడానికి సద్గురువు రూపంలో శ్రీ సాయినాధుడు అవతరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Kalki Jayanti 2025: కల్కి జయంతి.. పూజ, జపం, దానధర్మాలతో విశిష్ట ఫలితాలు

Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

తర్వాతి కథనం
Show comments