Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంజనాద్రిపై శ్రీరామ తీర్థం, సీతా తీర్థం... హనుమంతుడు అక్కడే...

రామ భక్త హనుమ శ్రీనివాసుని దాసానుదాసుడు కూడా. కలియుగ వైకుంఠ వాసుని సేవించడానికి తిరుమలగిరులలో అనేకానేక పేర్లలో వెలిశాడు. ఏడుకొండల్లో ఓ కొండ.. హనుమంతుడి మాతృమూర్తి పేర అంజనాద్రిగా వర్థిల్లుతోంది. అంజనా దేవి తపస్సు చేసిన దివ్యస్థలమే అంజనాద్రి. ఆ పుణ్యమ

Advertiesment
అంజనాద్రిపై శ్రీరామ తీర్థం, సీతా తీర్థం... హనుమంతుడు అక్కడే...
, శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (14:38 IST)
రామ భక్త హనుమ శ్రీనివాసుని దాసానుదాసుడు కూడా. కలియుగ వైకుంఠ వాసుని సేవించడానికి తిరుమలగిరులలో అనేకానేక పేర్లలో వెలిశాడు. ఏడుకొండల్లో ఓ కొండ.. హనుమంతుడి మాతృమూర్తి పేర అంజనాద్రిగా వర్థిల్లుతోంది. అంజనా దేవి తపస్సు చేసిన దివ్యస్థలమే అంజనాద్రి. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన ప్రదేశమూ ఇదేనంటారు. ఆ స్థల మహత్యం తెలిసిన జాపాలి ఈ కోనలో ఘోర తపస్సు చేశాడట. 
 
మహర్షి అంకుఠిత దీక్షకు మెచ్చిన ఆంజనేయ స్వామి స్వయంభువుగా వెలిశాడని స్థల పురాణం. రావణ సంహారం తరువాత... సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జాపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్టు మరో కథనం. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమనీ, సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతా తీర్థమనీ పేర్లు వచ్చాయి.
 
ఇవి ఆలయానికి తూర్పున ఒకటి, పడమర ఒకటీ ఉన్నాయి. వన్య మృగాలకు నెలవు ఈ ప్రాంతం. అందులోనూ.... ఉడుతల దండు కనువిందుచేస్తుంది. లంకకు వారధి కట్టడంలో ఉడతాభక్తిగా సేవ చేసిన ఫలం కారణంగా, ఇక్కడ నీడను ఇచ్చాడు భగవంతుడు. పాపనాశం వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుక్రవారం (13-04-18) దినఫలాలు : ఓర్పు - పట్టుదలకు పరీక్షా సమయం..