Mahalaya Amavasya 2025: రవి అమావాస్య, మహాలయ అమావాస్య.. రెండూ ఒకే రోజు..

సెల్వి
శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (16:18 IST)
Mahalaya Amavasya
పితృపక్షాల్లో వచ్చే అమావాస్యను మరింత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెలలో సెప్టెంబర్‌ 21న అమావాస్య కావడం అందులోనూ ఆదివారం రోజు రావడంతో మరింత విశిష్టత సంతరించుకుంది. దీనినే మహాలయ అమావాస్య అని కూడా పిలుస్తారు. అలాంటిది ఆదివారం అమావాస్య అంటే అరుదైన, ముఖ్యమైన తిథిగా భావిస్తారు. 
 
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. అమావాస్య చంద్రుని శక్తి తగ్గిన రోజు. ఈ రెండూ కలిసినప్పుడు ప్రత్యేక యోగం ఏర్పడుతుందని చెబుతారు. దీన్నే రవి అమావాస్య అంటారు. అలాగా భాద్రపద మాసంలో చివరి రోజు వచ్చే అమావాస్య రోజును మహాలయ అమావాస్య అని కూడా అంటారు. 
 
ఈ రోజున చేసే పూజలు, దానధర్మాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని కూడా నమ్మకం. పితృదోషం ఉన్న వారు ఈరోజున ప్రత్యేక పూజలు, తర్పణాలు విడవడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు కలిగి దోషాల నుంచి విముక్తి కలుగుతుందని నమ్మకం. 
 
ఇక ఈరోజున సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆరోగ్యం, శక్తి, ఆత్మ విశ్వాసం మెరుగుపడుతాయి. ఆదివారం అమావాస్య రోజు పూర్వీకులకు పిండ ప్రధానం ఇవ్వడం వల్ల వారి ఆత్మ శాంతి కలుగుతుంది. 
 
అలాగే.. ఆదివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో ఎర్రటి పూలు, బెల్లం, కుంకుమ వేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వడం శుభప్రదం. 
 
అలాగే.. ఆదివారం అమావాస్య రోజు దానం చేయడం కూడా చాలా మంచిది. నువ్వులు, గోధుమలు, బెల్లం, ఎర్రటి వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

గాల్లో ఉండగా ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య - ప్రయాణికులు సురక్షితం

అన్నీ చూడండి

లేటెస్ట్

07-10-2025 మంగళవారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

బ్రహ్మ రాక్షసిని శిక్షించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

కాముని పున్నమి.. లక్ష్మీదేవి ఉద్భవించిన పూర్ణిమ.. పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి?

06-10-2025 సోమవారం ఫలితాలు - దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు...

05-10-2025 ఆదివారం దిన ఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం.. దుబారా ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments