Air India: విమానం రెక్కల్ని ఢీకొన్న పక్షి- 103మంది ప్రయాణీకులను కాపాడిన పైలట్
, గురువారం, 18 సెప్టెంబరు 2025 (20:53 IST)
వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. పైలట్ సమయోచితంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో ఎగురుతుండగా ఎయిరిండియా విమానం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంది. కానీ సిబ్బంది దానిని సురక్షితంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే.. విమానం మధ్యాహ్నం 2.20 గంటలకు వైజాగ్ నుండి బయలుదేరింది. ప్రయాణంలో, ఒక పక్షి విమాన రెక్కలలో ఒకదానిని ఢీకొట్టడం వల్ల పరిస్థితి అదుపు తప్పింది. కానీ పైలట్ వెంటనే స్పందించి విమానాన్ని వెనక్కి తిప్పాడు. పైలట్ ఇలా సకాలంలో స్పందించిన కారణంగా, విమానం వైజాగ్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. 103 మంది ప్రయాణికులు సురక్షితంగా హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు.
ఎయిర్ ఇండియా ప్రస్తుతం ఈ ప్రయాణీకుల కోసం ప్రత్యామ్నాయ ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తోంది. పక్షులు ఢీకొనడం చాలా కాలంగా విమానాలకు ప్రమాదంగా ఉంది. గతంలో ఇలాంటి సంఘటనలు చాలాసార్లు జరిగాయి. పక్షులు గాలిలో విమానాలను ఢీకొట్టడం తీవ్రమైన భద్రతా సమస్యగా మిగిలిపోయింది.
పక్షులు గగనతలంలో విమానాలకు ఢీకొట్టే ఘటనలు కొత్తవి కావు. కానీ ఇటువంటి సంఘటనలు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయి. నిపుణులు ఈ సమస్యపై మరింత జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు. విమానాశ్రయాల చుట్టుపక్కల పక్షుల నివారణ చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.
తర్వాతి కథనం