Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్వాలాతోరణం అంటే ఏమిటి? యమలోకంలోకి వెళ్లిన వారికి తొలుత ఆ శిక్షే..?

జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున జరుపుతారు. శివ కేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలతోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయి. జ్వాలాతోరణ భస్మం ధరిస

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (12:24 IST)
జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున జరుపుతారు. శివ కేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలతోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయి. జ్వాలాతోరణ భస్మం ధరిస్తే బూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి. కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. 
 
కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలుపుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకొచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా వుంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడి పల్లకిలో అటూ ఇటూ మూడుసార్లు ఊరేగిస్తారు. శ్రీనాథుడు ద్రాక్షరామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణించారు. 
 
మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఓ కారణం వుంది. యమలోకంలోకి వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే.. ఈశ్వరుడిని ప్రార్థించాలి. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమ ద్వారం నుంచి మూడుసార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. 
 
అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి. జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే, శివా.. నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తానని ప్రతిజ్ఞ చేయాలి. జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి.. ఇంటి చూరులోనో, గడ్డివాములోనో, ధాన్యాగారంలోనో  పెడతారు. అది ఉన్న చోట సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. అది ఉన్న చోట భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని విశ్వాసం. - చాగంటి కోటేశ్వర రావు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో ఈ రెండు రాశులకు శనీశ్వరుడి యోగం..? కింగ్ అవుతారు..!

22-11-2024 శుక్రవారం వారం ఫలితాలు - దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది...

2025లో ఏ రాశుల వారికి శుభకరంగా వుంటుందో తెలుసా?

21-11-2024 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

భైరవ అష్టమి మహోత్సవం, 2024 రకాల మిఠాయిల భోగం, 84,000 చదరపు అడుగుల రంగోలీ ప్రపంచ రికార్డు

తర్వాతి కథనం
Show comments