Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలు ఎరుపు రంగు బొట్టునే ఎందుకు పెడతారో తెలిస్తే...

మహిళలు ఎన్ని రకాలుగా అలంకరించుకున్నా బొట్టు పెట్టుకుంటేనే వాళ్ళకు నిండుదనం వస్తుంది. మహిళల శరీరంలోని రకరకాల అవయవాలకు, అంగాలకు ఒక్కో దేవత లేక దేవుడు అధిపతులుగా ఉంటారు. నుదుటికి బ్రహ్మదేవుడు అధిపతిగా ఉం

Advertiesment
మహిళలు ఎరుపు రంగు బొట్టునే ఎందుకు పెడతారో తెలిస్తే...
, గురువారం, 2 నవంబరు 2017 (17:30 IST)
మహిళలు ఎన్ని రకాలుగా అలంకరించుకున్నా బొట్టు పెట్టుకుంటేనే వాళ్ళకు నిండుదనం వస్తుంది. మహిళల శరీరంలోని రకరకాల అవయవాలకు, అంగాలకు ఒక్కో దేవత లేక దేవుడు అధిపతులుగా ఉంటారు. నుదుటికి బ్రహ్మదేవుడు అధిపతిగా ఉంటాడు. బ్రహ్మదేవుడికి ఇష్టమైన రంగు ఎరుపు. అందుకే బ్రహ్మకు ఇష్టమైన ఎరుపు రంగు బొట్టును మహిళలు పెట్టుకుంటుంటారు. 
 
అలాగే నుదుటి ప్రాంతాన్ని సూర్యకిరణాలు అస్సలు తాకకూడదు. అందుకోసం కూడా నుదుటిన బొట్టు పెట్టుకోవాలని అంటారు. కానీ ఈ రోజుల్లో ఫ్యాషన్ పేరిట కుంకుమను పెట్టుకోకుండా ప్లాస్టిక్ బొట్టులను పెట్టుకుంటారు. దాంతో దాంపత్య జీవితంలో కలహాలు వస్తున్నాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు. అనుకోని ప్రమాదాలు కూడా వస్తాయి. 
 
ఉంగరపు వేలితో కుంకుమను పెట్టుకుంటే మానసిక ప్రశాంతత, శాంతి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మధ్య వేలితే పెట్టుకుంటే ఆయుష్షు వృద్ధి చెందుతుంది. బొటను వేలితే పెట్టుకుంటే అనూహ్యమైన శక్తి లభిస్తుంది. చూపుడు వేళితే పెట్టుకుంటే చెడు అలవాట్లన్నీ సమసిపోయి ఆధ్మాత్మిక చింతనతో ఉంటారు. 
 
కనుబొమలున్న ప్రదేశాన్ని అభిముక్త క్షేత్రం అని పురాణాలు చెపుతున్నాయి. కనుబొమల మధ్య కొంతమంది గంధం పెట్టి బొట్టుకుంటుంటారు. ఇది చల్లధనాన్ని ఇస్తుంది. మనసుకు, శరీరానికి చల్లధనం లభిస్తుంది. ఆధునిక పోకడలతో బొట్టు బిళ్లలు కాకుండా కుంకుమ బొట్లు ధరించడం మంచిదంటున్నారు జ్యోతిష్యులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం : 02-11-17 దినఫలాలు