Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరవణభవ నామ జపం చేస్తే చాలు, అంతరార్థం తెలుసా?

ఐవీఆర్
బుధవారం, 28 మే 2025 (19:26 IST)
వ్యాసమహర్షిచే రచించబడిన స్కంద పురాణం ప్రకారం మహా శక్తిసంపన్నుడైన షణ్ముఖుడు మహేశ్వరుని తేజము అగ్నిదేవుని ద్వారా గంగను చేరగా, ఆ శక్తిని తాళలేక గంగాదేవి రెల్లు పొదలలో త్యజించగా షణ్ముఖుడు ఉద్భవించాడు. రెల్లు పొదల్లో ఉద్భవించినందుకు షణ్ముఖుడు శరవణభవుడయ్యాడు.
 
నిఘంటువులో 'శర+వణ+భవ' కి అర్థము పరికించి చూడగా:
 
     శర = రెల్లు పొద, బాణము
     వణ= శబ్దం చేయుట
     భవ= పుట్టుక, ఉనికి
 
ఈ పదాలను జోడించి “శరవణభవ” కి అర్ధము చూడగా “రెల్లు పొదలో శబ్దము చేసిన” లేదా “రెల్లు పొదలో పుట్టిన” అని వస్తుంది. ఇంకొక అర్థము “బాణము శబ్దము చేయుచు పుట్టిన” అనగా   బాణము  సంధించిన వాడు అని వ్యుత్పత్యార్థముగా చెప్పుకొనవచ్చు. శరవణభవుడు శతృనాశనము చేయువాడు మరియు కామ,  క్రోధ,  లోభ, మోహ, మధ, మాత్సర్యాలు అను అరిషడ్వర్గాలను నాశనము చేయువాడు మరియు అజ్ఞానమును నాశనము చేయువాడని పండిత శ్రేష్ఠులు  వివరిస్తున్నారు.
 
పురాణాలననుసరించి “శరవణభవ”కు గూడార్థము ఈ క్రింది విధంగా చెప్పుకొనవచ్చు.
 
శ - శమింపజేయువాడు లేదా శాంతిని చేకూర్చు వాడు.
ర - రతి పుష్టినిచ్చువాడు అనగా సంతానప్రాప్తికి దోహద పడేవాడు లేదా ఆనందనురాగములు కలిగించువాడు.
వ - వంథ్యత్వము రూపుమాపు వాడు అనగా సంతానలేమికని నివారించు వాడు.
ణ - రణమున జయమునిచ్చువాడు అనగా శత్రువులపై విజయము కలిగించు వాడు.
భ- భవసాగరమును దాటించువాడు అనగా సంసారం అనే సముద్రమును దాటించువాడు.
వ- వందనీయుడు అనగా నమస్కరింపతగ్గవాడు లేదా పూజనీయుడు.
 
శరవణభవ మంత్రాన్ని పఠించినంత మాత్రాన సమస్త సన్మంగళములు ప్రాప్తిస్తాయి.
శరవణభవ మంత్రములో :
శ - లక్ష్మీ బీజము అధిదేవత శంకరుడు
ర - అగ్నిభీజము అధిదేవత అగ్ని
వ - అమృతభీజము అధిదేవత బలభద్రుడు
ణ -  యక్షభీజము అధిదేవత బలభద్రుడు
భ - అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి
వ - అమృతభీజము అధిదేవత చంద్రుడు
 
'శరవణభవ' అని తలచినంతనే మంత్రములతో నిబిఢీకృతులైయున్న అధిదేవతలందరూ సర్వశుభాలు కలుగజేస్తారు.
 
శుచిర్భూతులై భక్తిశ్రద్దలతో 'శరవణభవ' అని తలుచుకుంటూ
" నమస్తే నమస్తే మహాశక్తి పాణే
   నమస్తే నమస్తే లసద్వజ్రపాణే
   నమస్తే నమస్తే కటిన్యస్త పాణే
   నమస్తే నమస్తే సదాభీష్టపాణే"
 
అని స్తుతిస్తే చాలు శరవణభవుడు భక్తులపై కరుణాకటాక్షాలు ప్రసరింపజేస్తాడు. ఒక చేత్తో మహాశక్తి ఆయుధాన్ని, ఒక చేత్తో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేయి కటిపై ఉంచి, మరొక చేతితో అభయప్రదానము చేయు స్వామికి నమస్కారములు అని త్రికరణశుద్ధిగా పూజించి కార్యోన్ముఖులైన భక్తులకు కార్యనిర్వహణలో అడ్డంకులు తొలగి విజయము ప్రాప్తిస్తుంది. షణ్ముఖుడు శరవణభవుడి అనుగ్రహము వలన ఆనందము, జ్ఞానము, శతృనాశనము, జయము, రక్షణ మరియు సంపదలు కలుగుతాయని పురాణాలు ప్రవచిస్తున్నాయి. జాతక రీత్యా కుజదోషము, నాగదోషము ఉన్నవారు స్వామిని ఆశ్రయిస్తే ఆ దోషాలు నివారించబడి వివాహము కానివారికి వివాహము జరుగుతుందని, వైవాహిక జీవితములోని విభేదాలతో బాధపడుతున్నవారు విభేదాలు తొలగుతాయని, ఆనందము, ఐశ్వర్యము, సంతాన ప్రాప్తి కలుగుతాయి.
 
శరవణభవుడు ఎక్కువగా ఈ క్రింద పేర్కొన్న పేర్లతో స్తుతించబడతాడు.
సుబ్రహ్మణ్యస్వామి - బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడు
షణ్ముఖుడు- ఆరు ముఖములు కలవాడు
కార్తికేయుడు - కృత్తికా నక్షత్రం సమయములో అవతరించిన వాడు
వేలాయుధుడు - శూలము ఆయుధముగా కలవాడు
గాంగేయుడు - గంగనుండి వచ్చినవాడు
సేనాపతి - దేవతల సేనాధిపతి
స్వామినాధుడు - శివునికి ప్రణవమంత్రముయొక్క అర్దం చెప్పినవాడు.              
స్కందుడు - తల్లి పార్వతీదేవి పిలిచిన విధంగా
కుమారస్వామి- గౌరీ శంకరుల కుమారుడు
మురుగన్  - అందమైన వాడు (తమిళంలో)
ఇచ్చాశక్తి, క్రియాశక్తికి రూపాలైన వల్లీ దేవసేనలు భార్యలుగా గల కార్తికేయుడు శరణన్నవారిపై అపారమైన కరుణ చూపే దేవుడు. నెలలో శుక్లపక్ష పంచమినాడు ఉపవాసము ఉండి, శుక్లపక్ష షష్ఠి నాడు నియమనిష్టలతో పూజిస్తే విశేష శుభ ఫలితములు స్వామి అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం.

-కె. వెంకటరాజు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments