Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన మనవడికి భగవద్గీత నేర్పిస్తున్న రజాకార్ నిర్మాత

దేవీ
బుధవారం, 28 మే 2025 (17:14 IST)
Gudur Narayana Reddy, Samar Veer Reddy, Dr. L.V. Gangadhar Sastry
1940 దశకంలో నిజాం రాజుతో చేతులు కలిపి, కాలక్రమేణా ఆ రాజ్యాన్నే నియంత్రిస్తూ, తెలంగాణా రాష్ట్రాన్ని ముస్లిం రాష్ట్రం గా మార్చాలనే లక్ష్యం తో, హిందువులపై ఘోరమైన అరాచకాలను చేసిన ముస్లిం మతోన్మాదులు రజాకార్లు...  కాగా హిందూసమాజపు కళ్ళు తెరిపించడానికి, నిజమైన చరిత్రను యథాతథం గా  కళ్ళకు కట్టినట్టుగా యాటా సత్యనారాయణ దర్శకత్వం లో నిర్మించిన ఉత్తమాభిరుచి గల నిర్మాత, సామాజిక సేవకుడు, రాజకీయ నాయకుడు శ్రీ గూడూర్ నారాయణ రెడ్డి హైదరాబాద్ లోని 'భగవద్గీతా ఫౌండేషన్' ను తన మనవడు చిII  సమర్ వీర్ రెడ్డి తో కలిసి సందర్శించారు. 
 
విశేషమేమిటంటే రజాకార్ల అరాచకాలను అడ్డుకున్న శ్రీ గూడూర్ నారాయణరెడ్డి మనుమడే అదే పేరుకలిగిన ఈ నారాయణరెడ్డి.ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ఆయనను దుశ్శాలువతో సత్కరించి భగవద్గీత ను బహూకరించారు. 'మా కుటుంబం ద్వారా ఆధ్యాత్మిక విలువలు కలిగిన ఒక పౌరుడి గా  మా మనవడిని ప్రపంచానికి అందించడం కోసం, అందుకు మీ ఆశీస్సుల కోసం వచ్చాను. నా మనవడికి భగవద్గీత నేర్పించదలచాను.' అన్నారు నారాయణరెడ్డి.

అందుకు గంగాధర శాస్త్రి - సర్వధర్మాన్ పరిత్యజ్య (18-66) అనే శ్లోకాన్ని చిరంజీవి తో చెప్పించి అతని స్పష్టమైన ఉచ్ఛరణకు ముగ్ధులై భగవద్గీత పుస్తకాన్నిచ్చి ఆశీర్వదించారు. 'భగవద్గవద్గీత శ్లోకాలు నోరు తిరగవు అనేవారికి ఈ పిల్లవాడి స్పష్టమైన ఉచ్చారణే ఒక పాఠం.  చెప్పడం లోనే లోపం తప్ప పిల్లలు నేర్చుకోలేకపోవడం అనేది లేదు.' అన్నారు గంగాధర శాస్త్రి. ఇదే సందర్భం లో అక్కడికి విచ్చేసిన ప్రసిద్ధ సినీ రచయిత శ్రీ సత్యదేవ్ జంగా (శ్యాంసింగరాయ్ చిత్రం ఫేమ్) ను అమెరికా నుంచి వచ్చిన శ్రీ రామ్మోహన్ వేదాంతం లను గంగాధర శాస్త్రి సత్కరించారు. పక్కనే భగవద్గీతా ఫౌండేషన్ అమెరికా శాఖ వ్యవస్థాపకుడు ఎల్ విశ్వతేజ కూడా వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

భర్తను హత్య చేయించి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని నటించిన భార్య...

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాను...

Tenth class girl: పదో తరగతి అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Khairatabad: గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణపతి

Weekly Horoscope : 13-07-2025 నుంచి 19-07-2025 వరకు మీ వార రాశి ఫలాలు

Shani Dev: శనిదేవుడిని శాంతింపజేయాలంటే ఈ మంత్రాలు పఠించాలి.. నలుపు రంగు దుస్తులు?

12-07-2025 శనివారం దినఫలితాలు - పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి...

తర్వాతి కథనం
Show comments