పూజ ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (21:56 IST)
కుల, మత, ప్రాంతీయ, వయో భేదాలు లేకుండా ఎవరైన పూజ చేసుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ.... ఆ పూజ త్రికరణశుద్ధిగా చేయాలి. అంటే మనోవాక్కాయకర్మలను పూర్తిగా భగవంతుడి మీదే లగ్నం చేసి పూజ చేయాలి. మనసుని పూర్తిగా పరమాత్మ మీద లగ్నం చేసి వాక్కుని శుద్దిగా ఉంచుకుని, స్పష్టంగా ఉచ్చరిస్తూ, పరిపూర్ణమైన భక్తితో క్రియను చేస్తూ భగవంతుడిని పూజించాలి తప్ప చిత్తం ఒకచోట, క్రియ ఒకచోట ఉండకూడదు.
 
అలాగాక ప్రచారం కోసం రోజులు, నెలలు తరబడి ఎన్ని గంటలు పాటు ఏకధాటిగా పూజ చేసినా ప్రయోజనం ఉండదు. నిరంతరమూ భగవంతుడిని మనసులో నిలుపుకుని కర్మఫలాన్ని ఆయనకే సమర్పిస్తున్నామన్నా భావనతో పూజ చేయాలి. అద్వైత స్థితిని పొందిన వారికి ప్రాపంచకమైన రీతి రివాజులతో పని లేదు. అలాకాని స్థితిలో ఉన్నప్పుడు, ప్రాపంచిక వాసనలనుంచి దూరంగా వెళ్లలేని పరిస్థితులలో ఉన్నప్పుడు పూజాదికాలు మీ మనస్సును పరమాత్మతో అనుసంధానం చేయడానికి పనికి వస్తాయి. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరి కీర్తి నుడవడేని అని అందుకే అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొన ఊపిరితో ఉన్న కన్నతల్లిని బస్టాండులో వదిలేసిన కుమార్తె

డోనాల్డ్ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ టీవీ.. ఈ సారి గురి తప్పదంటూ కథనం

ఇరాన్ - అమెరికా దేశాల మధ్య యుద్ధ గంటలు... ఇరాన్‌కు వెళ్లొద్దంటూ భారత్ విజ్ఞప్తి

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

అన్నీ చూడండి

లేటెస్ట్

భోగి పండుగ రోజున వేరు శెనగలు, మొక్కజొన్న, నువ్వులు, బెల్లం మంటల్లో సమర్పిస్తే..?

13-01-2026 మంగళవారం ఫలితాలు - రుణ సమస్యలు ఆందోళన కలిగిస్తాయి..

2026లో రాశుల వారీగా ఫలితాలు- పరిహారాలు క్లుప్తంగా...

Makar Sankranti 2026 astrology: సంక్రాంతి రోజున రాజయోగం.. ఈ రాశులకు అదృష్టం

భోగి, మకర సంక్రాంతి, కనుమలకు ప్రత్యేకంగా ఏమి చేస్తారు?

తర్వాతి కథనం
Show comments