ఈ లక్షణాలున్న వ్యక్తి ప్రపంచమంతా వ్యతిరేకంగా వున్నా పోరాడగలడు...

Webdunia
గురువారం, 29 ఆగస్టు 2019 (22:22 IST)
సత్యం, పవిత్రత, నిస్వార్ధత- ఈ మూడూ ఎక్కడ ఉంటాయో.. అక్కడ సూర్యునికి పైన గాని క్రింద గాని ఉన్న ఏ శక్తులు పని చేయజాలవు. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి  ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పోరాడగలడు.
 
2. పరోక్షంగా ఇతరులను గూర్చి చెడుగా మాట్లాడడం పాపం. దీనిని మీరు పూర్తిగా విసర్జించాలి. మనస్సులో ఏమేమో తోచవచ్చు, కాని వాటిని బయట పెట్టటానికి ప్రయత్నిస్తే క్రమ క్రమంగా అవి గోరంతలు కొండతలుగా తయారవుతాయి. క్షమించి మరచిపోతే అంతా సమసిపోతాయి.
 
3. ఇతరులు ఏమి తలచినా, ఏమి చేసినా సరే నీవు మాత్రం నీ పావనత్వాన్ని, నైతిక వర్తనను, భగవద్భక్తి యెుక్క స్ధాయిని దిగజార్చకు.
 
4. పవిత్రత, సహనం, పట్టుదల-విజయాన్ని సాధించడానికి కావలసిన మూడు ఆవశ్యకాలు. వీటన్నింటికి మించి కావలసింది-ప్రేమ.
 
5. నీవు పవిత్రుడవు, బలసంపన్నుడవు అయితే నీవు ఒక్కడవు అఖిల జగత్తుకు సమానుడవు అవుతావు.
 
6. విద్యార్థి దశలో బ్రహ్మచర్యం నరాల్లో అగ్నిలా ప్రజ్వలించాలి.
 
7. పవిత్రులు కండి.. శక్తి వస్తుంది. పవిత్ర మనస్సులో అనంత శక్తి, గొప్ప సంకల్పబలం ఉంటాయి. బ్రహ్మచర్యం మానవాళిపై అద్భుతమైన నియంత్రణను ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మచర్యాన్ని పాలిస్తూ రావడం వల్లే వారికి శక్తి సంక్రమించింది.
 
8. పవిత్రత, నిశబ్దతల నుండే అమోఘ వాక్కు వెలువడుతుంది.
 
9. పవిత్రతే గొప్ప శక్తి. దాని ముందు మిగిలినదంతా బిత్తరపోతుంది.
 
10. నాయకుడిలో సౌశీల్యం లోపిస్తే విధేయతను పొందలేడు. సంపూర్ణ పవిత్రత కలకాలం నిలిచే విధేయతను, నమ్మికను పెంపొందిస్తుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో మూడు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన- రూ.675 కోట్ల పెట్టుబడులు

అమరావతిలో క్యాంటీ వ్యాలీ వుందని చెప్తాను.. ఏపీ సీఎం చంద్రబాబు

హర్ష వీణపై 2 కేసులు, కాల్ డిటైల్స్ తనిఖీ చేస్తున్నాం: రైల్వేకోడూరు అర్బన్ సీఐ

తమిళనాడులో విజయ్ స్వతంత్ర్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తే.. పోల్ ఏం చెప్తోంది?

పాఠశాలల్లో విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందించాలి : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

27-01-2026 మంగళవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

26-01-2026 సోమవారం ఫలితాలు - శ్రమతో కూడిన ఫలితాలిస్తాయి...

25-01-2026 నుంచి 31-01-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

25-01-2026 ఆదివారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...

తర్వాతి కథనం
Show comments