కష్టాలు అధిగమించినవారు ఎలా వుంటారో తెలుసా?

Webdunia
గురువారం, 15 జులై 2021 (22:47 IST)
జీవితంలో కష్టం, నష్టం, దుఃఖం మనిషికి సాధారణం. అతడు ధనవంతుడు కావచ్చు కటిక పేదవాడు కావచ్చు. మనిషి జీవితంలో ఇవి సాధారణంగా వస్తుంటాయి. ఐతే చిన్నచిన్న కష్టాలను ఎదుర్కోలేని కొందరు ఈరోజుల్లో తనవు చాలించడం కనబడుతుంది.

కానీ ఆత్మహత్య మహాపాపం అన్నది పురాణాల్లో చెప్పబడింది. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు అన్నీ ఆ భగవంతుడిపైనే భారం వుంచి ముందుకు నడవాలి. 24 గంటల్లో చీకటి 12 గంటలు వున్నట్లే జీవితంలో కష్టాలు కూడా అంతే. ఆ తర్వాత సూర్యకాంతిలా సంతోషం ఇంట్లోకి వస్తుంది. అందుకే కష్టం వచ్చిందని కుంగిపోకూడదు.
 
అంతేకాదు ఇతరుల తప్పిదాలు అవి ఎంత చెడ్డవైనా వాని విషయం ఎన్నడూ ఎవ్వరితో ప్రసంగించకండి. దాని వల్ల ఉపయోగమేమీ లేదు. 
 
ద్వేషపూరిత హృదయానికి సంతృప్తి కలుగదు. ద్వేషం కార్చిచ్చు వంటిది. శాస్త్రాధ్యయనం వలన మానవుడు మేధావి కాలేడు. మహాత్ముల దైనందిక కార్యములందు సన్నిహితాన్ని పెంపొందించుకొనగలిగిన వాడే జ్ఞానియై రాణించగలడు.
 
దైవ చింతనతో గడుపుతున్న జీవితం స్వల్పకాలమైనా ఉత్తమమైనదే. దైవ భక్తి లేని జీవి లక్షలాది సంవత్సరాలు బ్రతికి ఉన్న ప్రయోజనం శూన్యమే.
 
కష్టపడి పనిచేయి. దేవుడు నామము ఉచ్చరించు. సద్గ్రంధాలు చదువు. వంతులకు, పోటీలకు పోవద్దు. అలా చేస్తే భగవంతునికి ఏహ్యం కలుగుతుంది.
 
మన సంభాషణయందు మనం సత్యాన్ని ఆచితూచి పలకాలి. సాధకుడు మితభాషిగా ఉండాలి. 
 
దైవాన్ని మరచిన వారికి బలహీనత కలుగుతుంది. పరమేశ్వరుని జ్ఞాపకముంచుకొనవలనంటే ఆయన మహిమను, నామాన్ని స్మరించడం అవసరం.
 
కష్టాలను అధిగమించితే మనకు నూతనుత్తేజం, ఆధ్యాత్మిక బలం చేకూరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సోమనాథ్ ఆలయ చరిత్రను తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు : ప్రధాని నరేంద్ర మోడీ

రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించడం ఇష్టంలేదు : వెంకయ్య నాయుడు

అమరావతి నిర్మాణం ఇక ఆగదని అర్థమైంది.. అందుకే జగన్ అక్కసు : మంత్రి నారాయణ

సికింద్రాబాద్‌ను ముక్కలు చేస్తారా?

అత్యాచారం కేసులో కేరళలో కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే అరెస్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

Srivani Darshan: ఉదయం బుక్ చేసుకుంటే సాయంత్రం శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు.. ఎలా?

Lizard Sound Astrology: బల్లి శబ్ధం- ఫలితాలు.. నైరుతి దిశలో బల్లి శబ్ధం చేస్తే..?

08-01-2026 గురువారం ఫలితాలు - పనులు మొండిగా పూర్తిచేస్తారు...

2026 సంవత్సరం నాలుగు రాశుల వారికి అదృష్టం.. ఆ రాజయోగాలతో అంతా శుభమే

Varahi Puja: కృష్ణపక్ష పంచమి రోజున వారాహి దేవిని పూజిస్తే..?

తర్వాతి కథనం
Show comments