Webdunia - Bharat's app for daily news and videos

Install App

బదరీ వృక్షం మహిమాన్వితం...

మహాభారత ఇతిహాసంలో భారతీయ నాగరికతలో హిందువుల పూజలలో పాలు పంచుకుంటున్న వృక్ష జాతులలో బదరీ వృక్షం ఒకటి. దేవునికి నివేదించో పండ్లలో రేగుపండు ఒకటి. ఈ రేగు పండునే బదరీ ఫలమని అంటారు. రామాయణంలో శబరి శ్రీరామున

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (11:35 IST)
మహాభారత ఇతిహాసంలో భారతీయ నాగరికతలో హిందువుల పూజలలో పాలు పంచుకుంటున్న వృక్ష జాతులలో బదరీ వృక్షం ఒకటి. దేవునికి నివేదించో పండ్లలో రేగుపండు ఒకటి. ఈ రేగు పండునే బదరీ ఫలమని అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించపండు ఈ రేగుపండే. పిల్లలకు పోసే భోగిపండ్లు కూడా రేగు పండ్లే.
 
సూర్యభగావానునికి రేగు పండ్లంటే చాలా ఇష్టం. రథసప్తమిరోజున చిక్కుడు ఆకులతోపాటు రేగు ఆకులను కూడా తలమీద పెట్టుకుని స్నానం చేస్తుంటారు. వినాయకుని పూజలలో కూడా ఈ రేగు ఆకులను సమర్పిస్తారు. బదరీనాథ్‌లో ఉన్న స్వామివారికి రేగుపండ్లంటే అమిత ఇష్టం. అందువలనే ఈ స్వామివారికి బదరీనారాయణుడనే పేరు వచ్చింది.
 
వ్యాసుడు బదరీ ద్వీపంలో పుట్టినందువలనే ఆయనకు బాదరాయణుడనే పేరు వచ్చింది. శాస్త్ర గ్రంథాలలో కూడా ఈ బదరీవృక్షం అత్యంత ప్రసక్తికరమైనది. ఈ బదరీ చెట్టు పండ్లలోనే కాదు, ఆకులలోను, బెరడులోను, చివరకు గింజల్లో కూడా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. మందమతులుగా ఉన్న పిల్లలచేత ప్రతిరోజూ రేగుపండ్లను తినిపిస్తే వారి బుద్ధి వికసిస్తుందట. 
 
అంతేకాకుండా ఈ బదరీ ఆకు పసరును పుండ్లు, వ్రణాలు వంటి వాటిపై కూడా పూతలా వేసుకుంటే త్వరగా ఉపశమనం పొందవచ్చును. కొన్ని దేశాలలో వీటి లేత ఆకులను కూరగా కూడా వండుకుని తింటుంటారు. అలానే ఈ రేగుపండ్లతో పండ్లరసాలు, వడియాలు వంటి వంటకాలు కూడా తయారుచేసుకోవచ్చును.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments