ఆపద సమయంలో ఆదుకున్న ఆత్మ... పెళ్లి చేసుకునేటప్పుడు ఎందుకు?
వర్షం పడుతుండగా ఇంటివైపు వడివడిగా అడుగులు వేస్తూ వెళ్తున్నాడు అప్పారావు. ఇంతలో అక్కడే ఆరిపో అంటూ ఎవరో అప్పారావుతో మాట్లాడుతున్నారు. మరి ఏం జరిగిందో చూద్దాం.
వర్షం పడుతుండగా ఇంటివైపు వడివడిగా అడుగులు వేస్తూ వెళ్తున్నాడు అప్పారావు. ఇంతలో అక్కడే ఆగిపో అంటూ ఎవరో అప్పారావుతో మాట్లాడుతున్నారు. మరి ఏం జరిగిందో చూద్దాం.
‘‘అక్కడే ఆగిపో... నీ ముందున్న చెట్టు పడబోతుంది...’’ అంటూ ఎవరో అరిచినట్టు అనిపించి అప్పారావు ఆగిపోయాడు. వెనక చూస్తే ఎవరూ లేరు కానీ నిజంగానే చెట్టు పడిపోయింది. ఆశ్చర్యపోతూనే ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కబోతుంటే... ‘‘వద్దు... ఎక్కకు ఆ ఆటోకి యాక్సిడెంట్ అవుతుంది...’’ అని వినిపించి ఆగిపోయాడు.
ఇంతలో మరెవరో ఆ ఆటో మాట్లాడుకున్నారు. అది కదిలి కదలగానే ఓ కారు వచ్చి కొట్టేసింది. అప్పారావు మరింత ఆశ్చర్యపోతూ... ‘‘నన్నింతగా రక్షిస్తున్నావు.. ఎవరు నువ్వు?’’ అని అడిగాడు. ‘‘నేను అశరీరవాణిని’’ అంటూ సమాధానం వచ్చింది.
‘‘ఇంతలా నా క్షేమం కోరేవాడివైతే నేను పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎక్కడ చచ్చావ్... వచ్చి రక్షించాలని తెలియదా??’’ అంటూ ఏడవడం మొదలెట్టాడు అప్పారావ్.