తమలపాకును ఎండబెట్టి పారేస్తున్నారా? (video)
సాధారణంగా ఇంటి ఆవరణలో చెట్లు, మొక్కలు, తీగలతో కూడిన మొక్కలను నాటుతుంటాం. వృక్షాలను ఇంట నాటడం ద్వారా అభివృద్ధి వుంటుందని విశ్వాసం. ఈ క్రమంలో దైవ మూలికగా చెప్పుకుంటున్న తమలపాకు తీగల్ని ఇంట నాటడం ద్వారా
సాధారణంగా ఇంటి ఆవరణలో చెట్లు, మొక్కలు, తీగలతో కూడిన మొక్కలను నాటుతుంటాం. వృక్షాలను ఇంట నాటడం ద్వారా అభివృద్ధి వుంటుందని విశ్వాసం. ఈ క్రమంలో దైవ మూలికగా చెప్పుకుంటున్న తమలపాకు తీగల్ని ఇంట నాటడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే తులసి, వేపచెట్టు, మారేడు చెట్లను ఇంట నాటడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయి.
తమలపాకుల్లో రెండు రకాలున్నాయి. కారంతో కూడిన ఆకులు, లేత పచ్చరంగులతో కూడిన తమలపాకులు. ఇందులో నలుపు కరివేపాకు అనేది కాస్త కారంగా వుంటుంది. ఇది ముదురు పచ్చ రంగులో వుంటుంది. సాధారణంగా తమలపాకు, వక్క, సున్నం ఈ మూడింటిని సమంగా తీసుకుని.. తాంబూలం వేసుకోవాలి. తాంబూల సేవనం ద్వారా శరీరానికి క్యాల్షియం అందుతుంది.
తాంబూల సేవనం అనేది ప్రాచీన కాలం నుంచే ఆచారంలో వుంది. అలాంటి తాంబూలానికి ఉపయోగపడే తమలపాకులో ఔషధ గుణాలున్నాయి. ఎలాంటి శుభకార్యమైనా తమలపాకు లేనిదే ప్రారంభం కాదు. తమలపాకు, వక్క ఐక్యతకు మారుపేరు. ఏ శుభకార్యానికి వెళ్లినా ఆకువక్కా పెట్టడం చేయాలి. అయితే వట్టి తమలపాకు మాత్రం వుంచితే వారు శత్రువులవుతారని విశ్వాసం.
అందుకే ఏ శుభకార్యానికి వెళ్లినా ఆకువక్క తప్పక తీసుకెళ్లాలి. వట్టి తమలపాకును మాత్రమే శుభకార్యాలకు ఆహ్వానించడం కోసం వాడకూడదు. ఇక తమలపాకు తీగలు ఇంట నాటుకుంటే శుభఫలితాలు వుంటాయి. తమలపాకు తీగలు ఇంట ఏపుగా పెరిగితే.. ఆ ఇంట సిరిసంపదలకు లోటుండదని, విజయలక్ష్మి కొలువుంటుందని విశ్వాసం.
కాబట్టి విజయలక్ష్మి కటాక్షముండే తమలపాకును ఎండబెట్టి పారేయడం కూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. తమలపాకును ఎండబెట్టి పారేయడం, వాటిని ఎక్కడపెడితే అక్కడ పెట్టేయడం చేస్తే అశుభ ఫలితాలుంటాయని పండితులు హెచ్చరిస్తున్నారు.
ఇక ముఖ్యంగా శనిదేవుడు పట్టని హనుమంతునికి తమలపాకులంటే మహాప్రీతి. ఆయనకు తమలపాకు మాలను సమర్పిస్తే అన్నీ కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కానీ వట్టి తమలపాకులతో హనుమంతునికి మాల చేయకూడదు. ఆ ఆకుల్లో వక్కలను చేర్చి మాలగా కూర్చి.. హనుమంతునికి అలంకరించడం ద్వారా విఘ్నాలు తొలగిపోయి.. శుభాలు జరుగుతాయి.