ఆది వరాహస్వామి మహిమలు.... భక్తులు దర్శించుకుంటూ....

సమస్త భూ మండలాన్ని జలసమాధి చేయడానికి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ప్రయత్నించినప్పుడు అతణ్ణి సంహరించి భూదేవిని రక్షించడం కోసం సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు వరాహ అవతారమెత్తాడు. ఆ రాక్షసుడిని అంతంచేసి జల గ

Webdunia
శనివారం, 14 జులై 2018 (11:27 IST)
సమస్త భూ మండలాన్ని జలసమాధి చేయడానికి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ప్రయత్నించినప్పుడు అతణ్ణి సంహరించి భూదేవిని రక్షించడం కోసం సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు వరాహ అవతారమెత్తాడు. ఆ రాక్షసుడిని అంతంచేసి జల గర్భంలోని భూమిని తన కోరలతో పైకెత్తి బయటికి తీసుకువచ్చాడు. ఈ సందర్భంగా శ్రీ మహా విష్ణువెత్తిన ఈ వరాహ అవతారం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
 
ఈ అవతారంలో స్వామివారు రెండు ప్రదేశాల్లో మాత్రమే వెలిశారు. ఒకటి తిరుమల తిరుపతి కొండపైనా, మరొకటి కరీంనగర్ జిల్లాలోని కమాన్ పూర్ లోను ఉంది. తిరుమలలో వెలసిన ఆది వరాహ స్వామి ప్రధాన పూజలు అందుకుంటుంటాడు. ఎందుకంటే ఇక్కడ శ్రీ వెంకటేశ్వరుడికి ఆశ్రయమిచ్చినది ఆయనే. ఇక కమాన్ పూర్ విషయానికి వస్తే ఇక్కడ స్వామివారు ఒక రాయిపై వెలిశాడు.
 
మొదటి నుండి చూస్తున్నవారు తరచుగా దర్శించుకునే భక్తులు ఇక్కడి ఆది వరాహస్వామి వారు పెరుగుతున్నట్టుగా చెబుతున్నారు. ఎంతో విశిష్టమైనదిగా, మరెంతో మహిమాన్వితమైనదిగా చెప్పుకుంటోన్న ఈ క్షేత్రాన్ని స్థానికులు మాత్రమే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా ఆది వరాహస్వామిని దర్శించుకుని ధన్యులవుతుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సిడ్నీలో రోడ్డు ప్రమాదం.. రోడ్డు దాటిన 8నెలల గర్భవతి.. భారతీయ మహిళ మృతి

శబరిమలలో భారీ రద్దీ.. స్పృహ కోల్పోయి మృతి చెందిన మహిళా భక్తురాలు

నవంబర్ 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూపు-2 పరీక్ష రద్దు : తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

తర్వాతి కథనం
Show comments