Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాల సర్పదోషాన్ని పారదోలే నాగరుద్రాక్ష, ధరించవచ్చా?

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (21:56 IST)
రుద్రాక్షలు అనేక రకాలుగా వుంటాయి. వీటిలో నాగరుద్రాక్ష విభిన్నమైనది. ఈ రుద్రాక్షను ఆదిశేషుడు, నాగరాజు నాగేంద్ర స్వామి రూపంగా భావిస్తారు. ఈ రుద్రాక్షను మంగళవారం నాడు రాహుకాలంలో పూజించాలని చెపుతారు. అంతేకాదు, సుబ్రహ్మణ్య షష్ఠి, నాగ పంచమి, గ్రహణ సమయాల్లో పూజిస్తే ఎంతో మంచిదని విశ్వాసం.

 
ఈ రుద్రాక్షను పూజించాలనుకునేవారు తొలుత సుబ్రహ్మణ్యస్వామి సహస్రనామ పూజ, అష్టోత్తర నామపూజ, నాగేంద్రస్వామి పూజ చేయించాలి. అంతేకాకుండా శివాలయంలో రుద్రాభిషేకం, రాహుకాలంలో ఆవుపాలతో అభిషేకం చేయించాలి. కాలసర్ప దోషం కలవారు ఈ రుద్రాక్షను పూజిస్తే దోష నివారణ జరుగుతుంది.

 
నాగరుద్రాక్షను ధరించకూడదు. పూజ గదిలో వుంచి పూజించాలి. జాతక చక్రంలో కుజ, రాహు, కేతు గ్రహాల వల్ల కీడు జరుగుతున్నా, కుజ, రాహు, కేతు మహర్దశలు జరుగుతున్నా ఈ సర్ప రుద్రాక్షను తప్పక పూజిస్తే ఫలితం వుంటుంది. ఎక్కడైతే నాగ రుద్రాక్ష వుంటుందో వారికి పాముల వల్ల హాని వుండదు. అలాగ ధనానికి లోటు వుండదు. పేరుప్రఖ్యాతులు, సంపదలు తరలివస్తాయి.

 
ఈ రుద్రాక్షలు చాలా అరుదైనవి. అద్భుత మహిమలు కలవి. ఈ రుద్రాక్షలపైన నాగపడగ వుంటుంది లేదా సర్పాకారం వుంటుంది. నకిలీవి, చెక్కినవి అమ్ముతుంటారు కానీ పుట్టుకతోనే అలా వున్న రుద్రాక్షలు మహిమాన్వితమైనవి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142కోట్ల నిధులు.. కేంద్రం ఆమోదం..

ఫెంగల్ తుఫాను-తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

కాకినాడ ఓడరేవు భద్రతపై పవన్ ఆందోళన.. పురంధేశ్వరి మద్దతు

పార్వతీపురంలో అక్రమ మైనింగ్.. ఆపండి పవన్ కళ్యాణ్ గారూ..?

ఎంఎస్ కోసం చికాగో వెళ్లాడు.. పెట్రోల్ బంకులో పార్ట్‌టైమ్ చేశాడు.. కానీ..?

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments