Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏప్రిల్ 16 హనుమాన్ జయంతి.. శనివారం రావడం ఎంత విశేషమంటే?

hanuman jayanti
, శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (18:27 IST)
ఏప్రిల్ 16న హనుమాన్ జయంతి.. శనివారం రావడం విశేషం అని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఛైత్ర మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. 2022లో ఏప్రిల్ 16వ తేదీన అంటే శనివారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది 
 
ఈ ఏడాది హనుమాన్ జయంతికి ఓ ప్రత్యేకత ఉంది. శనివారం ఆంజనేయుడికి ఇష్టమైన రోజు. ఈ సంవత్సరం ఇదే రోజున హనుమాన్ జయంతి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున హనుమారాధన చేస్తే సర్వ శుభాలు చేకూరుతాయి.  
 
హనుమాన్ జయంతి రోజున అంటే శనివారం సాయంత్రం ఆంజనేయునికి ఆలయానికి వెళ్లి దీపారాధన చేయండి. మీరు వెలిగించే దీపానికి ఆవ నూనెను మాత్రమే వాడాలి. దీపం వెలిగించిన తర్వాత 11సార్లు హనుమాన్ చాలీసాను పఠించాలి. 
 
అలాగే గులాబీ పువ్వులతో కూడిన పూలమాలను దేవునికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శని గ్రహ ప్రభావం నుండి బయటపడొచ్చు
 
అనంతరం రామ రక్షా స్తోత్రం పఠిస్తే హనుమంతుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాగే శని భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇప్పటివరకు శని దోషం వల్ల కలిగిన ఆటంకాలన్నింటినీ అధిగమిస్తారు. మీ పనులన్నీ పూర్తిగా విజయవంతమవుతాయి.
 
అలాగే 11 తమలాపాకులపై రామ నామాన్ని రాసి హనుమంతునికి పువ్వుల మాలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాలిమేడలు: అందమైన అమ్మాయిలనిచ్చి వివాహం చేసేందుకు పోటీ పడుతుంటారు