Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైత్ర పౌర్ణమి రోజున పూజ ఇలా చేస్తే?

Moon
, శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (21:09 IST)
చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుడిని, సత్యనారాయణ స్వామిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. అలాగే అమ్మవారిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. దీపోత్సవం, అన్నదానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
పౌర్ణమి రోజున వ్రతమాచరించి సాయంత్రం పూట చంద్రుడిని ఆరాధించడం శుభఫలితాలను ఇస్తుంది. ఆ రోజున లలిత సహస్ర నామ పారాయణ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. 
 
ఆ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి.. శివకేశవుల ఆరాధన చేయడం మంచిది. అలాగే సత్యనారాయణ పూజతో సకలసంపదలు చేకూరుతాయి. ఆ రోజున ఉపవాసం చేసే వారు ఉప్పు వాడిన ఆహార పదార్థాలను తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
పౌర్ణమి వ్రతం ఆచరించడం ద్వారా మానసిక సంబంధిత మార్పులు జరుగుతాయి. చంద్రుడు మనఃకారకుడు కావున మానసిక బలం చేకూరుతుంది. 
 
ఆరోగ్యపరంగా శరీర మెటబాలిజం నియంత్రించబడుతుంది. జీర్ణక్రియను మెరుగపరుస్తుంది. పూర్తి మానవ శరీర వ్యవస్థను శుద్ధీకరిస్తుంది. ఇంకా చైత్ర పౌర్ణమి నేతి దీపాలను వెలిగించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. హనుమంతునికి, నారాయణ స్వామికి నేతి దీపం వెలిగించడం విశిష్ట ఫలితాలను ప్రసాదిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏప్రిల్ 16 హనుమాన్ జయంతి.. శనివారం రావడం ఎంత విశేషమంటే?