హోలీ రోజున పెద్దల ఆశీస్సులను తీసుకోవాలి. ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకుని శ్రీ మహావిష్ణువును పూజించాలి. అలాగే హోలికా దహన్ భస్మాన్ని ఇంటికి తీసుకురావాలి. ఇంట్లో భద్రంగా వుంచడం ద్వారా సంపదకు కొరత వుండదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయని చెబుతారు.
హోలీ పూజ సందర్భంగా ఇంట్లో ఏ వంటకం చేసినా అది దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. హోలికా రోజున తెల్లటి వస్తువులకు దూరంగా ఉండండి. ఈ రోజున, మద్యం సేవించడం మానుకోవాలి. హోలీ రోజున ఎవరికీ డబ్బు ఇవ్వకండి, ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోకండి.
ఇకపోతే.. చాలా డబ్బు సంపాదించినా, దానిని ఆదా చేయడంలో విఫలమైతే, గోమతీ చక్రాన్ని పసుపు గుడ్డలో కట్టి, బీరువాలో ఉంచండి. ఉంచే స్థలంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల సంపద చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.