Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎడమవైపు తొండం ఉండే విగ్రహన్ని మాత్రమే ఇంట్లో వుంచాలట!

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (20:49 IST)
వినాయకుడిని ఇంట్లో పెట్టుకునేటపుడు తొండం ఎటువైపు ఉండాలనే అనుమానం మీలో వుందా? ఐతే ఈ కథనం చదవండి. సాధారణంగా కుడివైపు తొండం తిరిగి ఉంటే.. లక్ష్మీగణపతి అంటారు. తొండం లోపల వైపునకు ఉంటే తపోః గణపతి అంటారు. ఇక తొండం గనుక ముందువైపునకు ఉంటే దానికి పూజలు అస్సలు చేయకూడదు అంటారు. 
 
అలాగే తీసుకునే గణపతి ముఖంలో చిరునవ్వు ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడు అలాంటి ఇంట్లో కూడా సుఖ, శాంతులు పెరుగుతాయి. ముఖ్యంగా గణపతికి చతుర్భుజాలు ఉండేలా చూసుకోవాలి. ఒక చేతిలో లడ్డూ, మరో చేతిలో కమలం, ఇంకో చేతిలో శంఖం, నాలుగో చేతిలో ఏదైనా ఆయుధం ఉండాలి. అలాడే వినాయకుడికి తొండం ఎల్లప్పుడూ ఎడమవైపుగా ఉండేలా చూసుకోవాలి. కేవలం ఎడమవైపు తొండం ఉండే విగ్రహన్ని లేదా చిత్రపటాన్ని కొనుగోలు చేయాలి.
 
గణేషుడి తొండం ఎప్పుడూ తన తల్లి గౌరీదేవి దిక్కుగా ఉండాలని, అందుకే ఎడమవైపు తొండం ఉన్న వినాయకుడిని తీసుకోవాలని ఆధ్యాత్మిక వేత్తలు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే కుడివైపు తొండం తిరిగి ఉన్న గణపతిని దక్షిణాముఖి గణపతి అంటారు. ఇలాంటి విగ్రహలను కేవలం గుడిలో మాత్రమే ఏర్పాటు చేస్తారు.
 
ఈ విధంగా ఉన్న గణపతికి ప్రతిరోజూ చాలా నిష్టగా పూజలు, ధూపదీప నైవేధ్యాలు అందిస్తారు. కాబట్టి ఇంట్లో పెట్టుకోకూడదు, గుడిలో మాత్రమే పెట్టుకోవచ్చు. గణపతి ముందు ముఖం సంపదను సూచిస్తే... వెనుక ముఖం పేదరికాన్ని సూచిస్తుంది. 
 
కాబట్టి వినాయకుని వెనుక ముఖం ఇంటి బయట ద్వారానికి ఎదురుగా ఉండేలా చూసుకోవాలి. ఇక ఇంటి దక్షిణ దిశలో గణేష విగ్రహన్ని ఎట్టిపరిస్థితుల్లో పెట్టరాదు. తూర్పుదిశ లేదా పశ్చిమదిశలో పెట్టుకోవచ్చు. అదేవిధంగా స్నానాల గది గోడకు కూడా వినాయకుడి విగ్రహన్ని పెట్టకూడదు. అలా చేస్తే అరిష్టమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ వరదలు- 788 మంది మృతి, వెయ్యి మందికి పైగా గాయాలు (video)

తెలంగాణాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఎయిర్‌లైన్స్ ప్రతినిధుల నిర్లక్ష్యం : ప్రయాణికులను వదిలివెళ్లిన ఇండిగో విమానం

రీల్స్, సెలూన్ వద్దన్నారు.. నిక్కీపై వరకట్నం వేధింపులు.. సజీవదహనం.. భర్తను అలా పట్టుకున్నారు? (video)

బాల్య వివాహాలను ఆపండి.. 18ఏళ్లు నిండిన తర్వాత మహిళలకు వివాహం చేయండి

అన్నీ చూడండి

లేటెస్ట్

Tapeswaram: తాపేశ్వరం లడ్డూల తయారీకి పూర్వ వైభవం.. గణేష్ పండల్ నుంచి ఆర్డర్లు

TTD: మోసాలకు అడ్డుకట్ట: భక్తుల కోసం తిరుమలలో ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ ల్యాబ్‌

23-08-2025 శనివారం దిన ఫలితాలు - మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది...

శ్రీ వల్లభ మహా గణపతిని పూజిస్తే ఏంటి ఫలితం?

Sambrani on Saturday: శనివారం సాంబ్రాణి వేస్తే.. ఎవరి అనుగ్రహం లభిస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments