Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తూ చట్టం చేయాలి : అలహాబాద్ హైకోర్టు

గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తూ చట్టం చేయాలి : అలహాబాద్ హైకోర్టు
, గురువారం, 2 సెప్టెంబరు 2021 (09:56 IST)
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, ఈ మేరకు పార్లమెంట్‌లో చట్టం చేయాలను పాలకులకు అలహాబాద్ హైకోర్టు సూచన చేసింది. అదేసమయంలో గోమాంసాన్ని భుజించడం అనేది ఓ హక్కు కాదని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. 
 
ఆవును దొంగిలించి శిరచ్ఛేదం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జావేద్ అనే నిందితుడు బెయిల్ కేసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు... అతనికి బెయిల్ నిరాకరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్‌తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
ఆవును చంపే హక్కు కంటే జీవించే హక్కు ఉన్నతమైనదని వ్యాఖ్యానించింది. గోమాంసాన్ని భుజించడం హక్కు కానేకాదని తేల్చిచెప్పింది. నిందితుడిని బెయిలుపై విడుదల చేస్తే మళ్లీ అటువంటి నేరానికే పాల్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గోవు ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకున్న వారిలో ముస్లిం పాలకులు కూడా ఉన్నారని న్యాయస్థానం గుర్తు చేసింది.
 
సంస్కృతి, విశ్వాసాలు దెబ్బతినే దేశం బలహీనంగా మారుతుందని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తూ, దానికి హాని తలపెట్టే వారిని కఠినంగా శిక్షించేలా పార్లమెంటు ఓ చట్టం తీసుకురావాలని కేంద్రానికి సూచించింది. 
 
భారత సంస్కృతిలో గోవుకు విశిష్ట స్థానం ఉందని, ప్రాథమిక హక్కు అనేది గోమాంసం భుజించే వారికి ప్రత్యేకం ఏమీ కాదని తేల్చి చెప్పింది. గోవును పూజించే వారికి, దానిపై ఆర్థికంగా ఆధారపడే వారికీ ఇది ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడు ప్రారంభం