Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా రోగులను ఆ రాముడే కాపాడాలి : అలహాబాద్ హైకోర్టు

Advertiesment
కరోనా రోగులను ఆ రాముడే కాపాడాలి : అలహాబాద్ హైకోర్టు
, మంగళవారం, 18 మే 2021 (13:00 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ వైరస్ స్వైర విహారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అలహాబాద్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇక రాముడే కాపాడాలని వ్యాఖ్యానించింది.
 
కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ద్విసభ్య బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే చిన్నచిన్న పట్టణాలు, గ్రామాలను కూడా రాముడే కాపాడాలని వ్యాఖ్యానించింది.
 
కరోనా సోకిన సంతోశ్ కుమార్ అనే వ్యక్తికి ఓ ఆసుపత్రిలో చికిత్స అందించారు. కానీ, ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతని మరణం తర్వాత... అతని మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తిదిగా ఆసుపత్రి వైద్యులు, స్టాఫ్ పేర్కొన్నారు. 
 
దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతులేని నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ అని మండిపడింది. సాధారణ రోజుల్లోనే ప్రజలకు అవసరమైన వైద్య సౌకర్యాలు కల్పించే పరిస్థితులు లేనప్పుడు... ఇక ఇలాంటి మహమ్మారి సమయంలో చెప్పేక్కర్లేదు.. వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
 
ప్రజలకు సరిపడా ఆసుపత్రులు కూడా లేవని మండిపడింది. ఒక హెల్త్ సెంటర్‌లో దాదాపు 3 లక్షల ప్రజల లోడ్ ఉంటే... అక్కడ కేవలం 30 బెడ్లు మాత్రమే ఉన్నాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. అంటే ఆ హెల్త్ కేర్ సెంటర్ కేవలం 0.01 శాతం మంది ప్రజలకు మాత్రమే సేవలందించగలదని దుయ్యబట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా రోగులను ఆ రాముడే కాపాడాలన్నారు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్‌ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి