Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మతాంతర వివాహాల వివరాలు డిస్‌ప్లే చేయొద్దు : అలహాబాద్ హైకోర్టు

Advertiesment
మతాంతర వివాహాల వివరాలు డిస్‌ప్లే చేయొద్దు : అలహాబాద్ హైకోర్టు
, గురువారం, 14 జనవరి 2021 (07:58 IST)
మతాంతర వివాహాలు చేసుకున్న నూతన వధూవరుల వివరాలను ప్రకటన బోర్డులపై డిస్‌ప్లే చేయొద్దని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే, ఇలాంటి వివాహాలపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినా... వాటిని స్వీకరించవద్దని తేల్చి చెప్పింది. 
 
కాగా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పెళ్లి కోసం ముస్లిం నుంచి హిందు మతానికి మారిన ఓ వధువు, ఆమె భర్త దాఖలు చేసిన పిటిషన్‌పై విచారిస్తూ న్యాయమూర్తి ఈ తీర్పు వెలువరించారు. తన పెళ్లికి తండ్రి అంగీకరించడం లేదని వధువు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. 
 
మతాంతర వివాహాలకు సంబంధించి 30 రోజులపాటు నోటీసులను ప్రదర్శించడం తప్పనిసరి కాదని తేల్చింది. ఆ నోటీసులను డిస్‌ప్లే చేయవద్దని వధువు, వరులు రాతపూర్వక విజ్ఞప్తి చేస్తే ప్రదర్శించవద్దని, ఆ వివాహంపై వచ్చే అభ్యంతరాలనూ స్వీకరించవద్దని స్పష్టం చేసింది. 
 
అలాంటి నోటీసులు ప్రాథమిక హక్కులు స్వేచ్ఛ, గోప్యతలను హరించివేస్తాయని, ఇతరుల జోక్యం లేకుండా స్వేచ్ఛగా జీవిత భాగస్వామ్యాన్ని ఎంచుకోవడంపై ప్రభావం వేస్తాయని పేర్కొంది.
 
స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్, 1954 కింద మతాంతర వివాహం చేసుకున్న జంట పెళ్లి గురించి డిస్ట్రిక్ట్ మ్యారేజీ ఆఫీసర్‌కు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నోటీసులను వారి జిల్లా కార్యాలయంలో 30 రోజులపాటు డిస్‌ప్లే పెట్టాల్సి ఉంటుంది. వారి పెళ్లిపై ఎవరైనా అభ్యంతరాలు చెబితే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 
 
ఈ చట్టంలోని కొన్ని సెక్షన్లు పౌరుల హక్కులకు భంగం కలిగిస్తున్నాయని న్యాయమూర్తి వివేక్ చౌదరి తెలిపారు. తమ పెళ్లి నోటీసులు ప్రదర్శనకు పెట్టవద్దని ఆ జంట రాతపూర్వకంగా అభ్యర్థిస్తే మ్యారేజీ ఆఫీసర్‌ నోటీసులను డిస్‌ప్లకే పెట్టవద్దని, అభ్యంతరాలను స్వీకరించకుండా పెళ్లి ప్రక్రియ చేపట్టాలని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో కరోనా టీకాల పంపిణీకి సర్వం సిద్ధం .. జిల్లాలకు చేరిన వ్యాక్సిన్ డోస్‌లు