Publish Date: Thu, 26 Aug 2021 (23:33 IST)
Updated Date: Thu, 26 Aug 2021 (23:35 IST)
పెరుగులో నాలుగు చుక్కల వెనిగర్ కలిపి చేతులకు రాసుకోవాలి. తరవాత గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయాలి. పులిసిన పెరుగు కూడా బాగా పని చేస్తుంది.
గోరువెచ్చటి కొబ్బరి నూనెలో చెంచా నిమ్మరసం కలిపి చేతులకు రాసుకోవాలి. తరవాత వేడి నీళ్లలో తడిపిన టవల్‌ని చుట్టుకోవాలి. వారానికోసారి ఇలా చేయడం వల్ల సమస్య క్రమంగా తగ్గుతుంది. అలాగే మూడు చెంచాల సెనగపిండిలో కాస్త పెరుగు కలిపి పూతలా వేసుకోవాలి. ఆరాక నీళ్లతో కడిగేసుకోవాలి. అలానే కలబంద గుజ్జు రాసుకున్నా సమస్య దూరమవుతుంది
తులసి ఆకులను మెత్తగా చేసి అందులో అరచెంచా పాలమీగడ, చిటికెడు పసుపు కలిపి రాత్రిపూట మోచేతులూ, మోకాళ్లకూ మర్దన చేసుకోవాలి. మర్నాడు చల్లటి నీళ్లతో శుభ్రపరచుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
సగానికి కోసిన నిమ్మచెక్కలతో మోచేతులకు మర్దన చేసుకోవాలి. ఇలా రెండుమూడు రోజులకోసారి చేస్తుంటే నలుపు క్రమంగా తగ్గిపోతుంది. అలానే తేనెలో పంచదార కలిపి నల్లగా ఉన్నచోట రుద్దుకోవాలి.