Webdunia - Bharat's app for daily news and videos

Install App

10-03-2019 నుంచి 16-03-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (20:50 IST)
సింహంలో రాహువు, కన్యలో బుధుడు, వృశ్చికంలో బృహస్పతి, ధనస్సులో శుక్రుడు, శని, రవి, మకరంలో కేతువు, మీనంలో కుజుడు, వృషభ, మిధున, కర్కాటక, సింహంలలో చంద్రుడు. ముఖ్యమైన పనులకు సప్తమి, బుధవారం శుభదాయకం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరుతాయి. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి అధికం. సభ్యత్వాలు, పదవులకు యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడుతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. దూరపు బంధువుల రాక సంతోషాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ముఖ్య సమాచారం సేకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆశావాహ దృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. సన్నిహితుల సాయం అందుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెంట్లు, ఏజెన్సీలను విశ్వసించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఆది, సోమ వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుకాదు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సంతానం చదువుల పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. విందులు, వేడుక్లోల పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి. 
 
మిథునం: మృగశిర 3, 4, పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
విమర్శలకు దీటుగా స్పందిసాతుర. నిజాయితికీ ప్రశంసలు లభిస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. సాయం అడిగేందుకు మనసు అగీంకరించదు. అవసరాలు వాయిదా పడుతాయి. మంగళ, బుధ వారాల్లో నగదు, వస్తువులు జాగ్రత్త. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కివస్తాయి. మానసికంగా కుదుటపడుతారు. రుణ యత్నం ఫలిస్తుంది. పరిస్థితుల అనుకూలత ఉంది. అవకాశాలను తక్షణం వినియోగింకోండి. సలహాలా, సహాయం ఆశించవద్దు. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. గురు, శుక్ర వారాల్లో ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. మీ శ్రీమతి వైఖరి అసహానం కలిగిస్తుంది. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. కొత్త పరిచయాలేర్పడుతాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.   
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల సానుకూలమవుతాయి. ధనలాభం ఉంది. శుభకార్యాలకు హాజరవుతారు. మీ రాక అయిన వారిని సంతోషపరుస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. మీ రాక అయిన వారిని సంతోషపరుస్తుంది. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. అనాలోచితంగా వ్యవహరించవద్దు. మంగళ, బుధ వారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుకుంటారు. మీ పథకాలు మునుముందు సత్ఫతాలిస్తాయి. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2, పాదాలు
ఈ వారం సంప్రదింపులు అనుకూలం. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరనీ అతిగా విశ్వసించవద్దు. ఖర్చులు అధికం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరి అసహానం కలిగిస్తుంది. ఓర్పుతో వ్యవహరించాలి. పట్టుదలతో పోవద్దు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. పనులు సకాలంలో పూర్తికాగలవు. లైసెన్సుల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెట్టుబడలు, వ్యాపారాల విస్తరణకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు కొత్త బాధ్యతలు, ఒత్తిడి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. దైవకార్యం, ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు.     
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొత్త సమస్యలెదరయ్యే సూచనులున్నాయి. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరుతాయి. ఆహ్వానం అందుకుంటారు. గురు, శుక్ర వారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పరిచయాలు ఉన్నతిక తోడ్పడుతాయి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. దస్త్రం వేడుకలకు ముహుర్తం నిశ్చయమవుతుంది. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వైద్య, సాంకేతిక, అకౌంట్స్ రంగాల వారికి ఆశాజనకం.   
 
వృశ్చికం: విశాఖ 1వ పాదం, అనురాధ, జ్యేష్ట
గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. చెల్లింపులు, అవసరాలు వాయిదా పడుతాయి. పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే. శనివారం నాడు శ్రమాధిక్యతతో పనులు పూర్తిచేస్తారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. నగదు, పత్రాలు జాగ్రత్త. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. పెద్దల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వేడుకలకు హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. వాహనం ఇతరులకివ్వడం క్షేమం కాదు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1వ పాదం
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు మెరుగుపడుతాయి. ధనలాభం ఉంది. అవసరాలు నెరవేరుతాయి. పనులు సకాలంలో పూర్తికాగలవు. సంప్రదింపులతో హడావుడిగా ఉంటారు. ఆది, సోమ వారాల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా ఆలోచించవద్దు. విశ్రాంతి అవసరం. ఆత్మీయుల కలయికతో కుదుటపడుతారు. సంతానం చదువులపై దృష్టి పెట్టండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగ్సుతంది. ప్రముఖులతో పరిచయాలేర్పడుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధఇ. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది.  
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
చిత్తశుద్ధిని చాటుకుంటారు. నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు సకాలంలో పూర్తికాగలవు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. మంగళ, శుక్ర వారల్లో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. గృహం సందడిగా ఉంటుంది. బంధుత్వాలు బలపడుతాయి. మీ సలహా ఎదుటివారికి కలిసివస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు మునుముందు ఫలిస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు తగదు. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. అవకాశాలను వదులుకోవద్దు. బుధు, గురు వారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆశావాహ దృక్పథంతో యత్నాలు సాగించండి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. ఒక సందేశం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. అధికారుల తీరును గమనించి మెలగాలి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి.  
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ వారం అనూకూలతలున్నాయి. కష్టం ఫలిస్తుంది. వాగ్ధాటితో రాణిస్తారు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించని ఖర్చులే ఉంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. గృహ నిర్మాణానలు, మరమ్మత్తులు చురుకుగా సాగుతాయి. శుభ, దైవ కార్యాలకు యత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. పూర్వ విద్యార్థుల కలయిక సంతోషాన్నిస్తుంది. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిన్నాపురంలో పవన్ పర్యటన.. హెలికాప్టర్‌ ద్వారా సోలార్ పవర్ ప్రాజెక్ట్ పరిశీలన (video)

ఘనంగా ఘట్కేసర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 6 వార్షికోత్సవం: ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

అన్నీ చూడండి

లేటెస్ట్

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

హనుమాన్ చాలీసాతో అంతా జయమే

Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)

తర్వాతి కథనం
Show comments