Webdunia - Bharat's app for daily news and videos

Install App

25-08-2019 నుంచి 31-08-2019 వరకు మీ రాశి ఫలితాలు.. (video)

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (19:12 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చుల సిద్ధంగా ఉంటాయి. చేతిలో ధనం నిలవదు. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. పెట్టుబడులకు సమయం కాదు. గురు, శుక్ర వారాల్లో పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. బాధ్యతల స్వయంగా చూసుకోవాలి. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకుటంటాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.
 
వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు.
సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు రూపొందించుకుంటారు. పొదుపునకు ఆస్కారం లేదు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. శనివారం నాడు వస్తువులు, నగదు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయాలి. ఉపాధ్యాయుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు. 
ఈ వారం పరిస్థితుల అనుకూలత ఉంది. బంధుత్వాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థలో మదుపు క్షేమం కాదు. శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. టెక్నికల్, మార్కెట్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. అధికారులకు ధనప్రలోభం తగదు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష.
గృహం సందడిగా ఉంటుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సమస్యలను దీటుగా ఎదుర్కుంటారు. నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. సంస్థల స్ధాపనలకు అనుమతులు మంజూరవుతారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఉపాధ్యాయులకు శుభవార్తా శ్రవణం. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. ప్రయాణం కలిసివస్తుంది.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
వ్యవహారాల్లో ప్రతికూలతలు అధికం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఓర్పుతో వ్యవహరించాలి. యత్నాలు విరమించుకోవద్దు. ఆది, సోమ వారాల్లో లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. సన్నిహితుల హితువు మీపై ప్రభావం చూపుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. గృహమార్పు కలిసివస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. అధికారులకు హోదా మార్పు, వ్యాపారాల్లో సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
ఆర్థిక సమస్యలెదురవుతాయి. పనులతో సతమతమవుతారు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. ఆత్మీయుల సాయం అందుతుంది. సమస్యలు సద్దుమణుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. మంగళ, బుధ వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. గృహమార్పు అనివార్యం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారుల తీరును గమనించి మెలగండి. వ్యాపారాల విస్తరణకు తరుణం కాదు. సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారికి సామాన్యం. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు.
ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. గురు, శుక్ర వారాల్లో పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలు సద్దుమణుగుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు చికాకులు అధికం. ఉపాధ్యాయుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట.
పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. ఆప్తులకు సాయం అందిస్తారు. శనివారం నాడు అనవసర జోక్యం తగదు. దంపతులకు సఖ్మత లోపం. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పట్టుదలకు పోవద్దు. సంతానం చదువులపై శ్రద్ధ అవసరం. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆహ్వానం అందుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. బంధువులతో అవగాహన నెలకొంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పెట్టుబడులకు తరుణం కాదు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు తగదు. పెద్దల సలహా పాటించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సన్మన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
అన్ని రంగాల వారికి యోగదాయకమే. ధనలాభం ఉంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. సమర్థతను చాటుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆది, సోమ వారాల్లో పనులు సాగవు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. నగదు, పత్రాలు జాగ్రత్త. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను విశ్వసించవద్దు. సంతానం విజయం సంతోషపరుస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధ్యాయులు శుభవార్తలు వింటారు.  వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు.
దుబారా ఖర్చులు విపరీతం. ధనమూలక సమస్యలెదురవుతాయి. ఆప్తుల సాయం అందుతుంది. మానసికంగా కుదుటపడతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మంగళ, బుధ వారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. దంపతులకు సఖ్యత లోపం. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఆరోగ్యం స్థరంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ప్రముఖుల కలయిక సత్ఫలితమిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. స్పెక్యులేషన్ లభిస్తుంది.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు.
రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. రుణ, ఒత్తిడి, దుబారా ఖర్చులు అధికం. వ్యవహారాలతో తీరిక ఉండదు. తొందరపాటు నిర్ణయాలు తగవు. గురు, శుక్ర వారాల్లో మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. మీ పై శకునాల ప్రభావం అధికం. ఈ చికాకులు తాత్కాలికమే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు గుర్తుకొస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులు నిస్తేజానికి గురవుతారు, వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి.
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు, నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. శనివారం నాడు వాగ్వాదాలు దిగవద్దు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. పొగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. నిర్మాణాలు పునఃప్రారంభమవుతాయి. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే అనుకూలం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం తగదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంకీర్ణ ప్రభుత్వంపై చిందులేసిన ఆర్కే రోజా.. తదుపరి ప్రభుత్వం మాదే

అల్లు అర్జున్‌పై ఎలాంటి కోపం లేదు : సీఎం రేవంత్ రెడ్డి

ఫీలింగ్స్ సాంగ్ చేయడం రష్మికకు ఏమాత్రం ఇష్టం లేదు : సీపీఐ నారాయణ

12 మంది భార్యలు... 102 మంది సంతానం... 578 మందికి తాతయ్య..

అన్నా యూనివర్శిటీ ప్రాంగణంలోనే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

లేటెస్ట్

22-12-2024 ఆదివారం దినఫలితాలు - రుణ సమస్యలు తొలగిపోతాయి..

Weekly Horoscope: 22-12-2024 నుంచి 28-12-2024 వరకు ఫలితాలు- మీ మాటలు చేరవేసే వ్యక్తులు?

21-12-2024 శనివారం దినఫలితాలు : ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి...

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తర్వాతి కథనం
Show comments