Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

21-07-2019 నుంచి 27-07-2019 వరకు మీ వార రాశి ఫలితాలు..

21-07-2019 నుంచి 27-07-2019 వరకు మీ వార రాశి ఫలితాలు..
, శనివారం, 20 జులై 2019 (19:12 IST)
మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బాధ్యతగా వ్యవహరించాలి. సంతానం ఉన్నత చదువుల కోసం శ్రమిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆది, సోమ వారాల్లో ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. అపరిచితులతో జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంప్రదింపులకు అనుకూలం. పెద్దల సలహా పాటించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. దంపతులకు కొత్త ఆలోచనలోస్తాయి. స్ధిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన అవసరం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు.  
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. వ్యవహారానుకూలత ఉంది. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. గృహమార్పు అనివార్యం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయంపై దృష్టి పెడతారు. మంగళ, బుధ వారాల్లో పనులు సాగవు. సన్నిహితులను కలుసుకుంటారు. ముఖ్యమైన పత్తాలు అందుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆర్యోగం కుదుటపడుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తులు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. రిటైర్డు ఉద్యోగులకు వీడ్కోలు పలుకుతారు. నిర్మాణాలు, మరమ్మతులు వేగవంతమవుతాయి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు.  
ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఇంటి విషయాలు పట్టించుకోండి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. యత్నాలు కొనసాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. మొండిబాకీలు వసూలవుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. గురు, శుక్ర వారాల్లో ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఊహించిన సంఘటనలెదరవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగాతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష   
ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. పట్టుదలతో యత్నాలు సాగాంచండి. అవకాశాలను వదులుకోవద్దు. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ధనలాభం ఉంది. అవసరాలు నెరవేరుతాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పనులు మొండిగా పూర్తు చేస్తారు. శనివారం నాడు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు, వస్తువులు సంపాదిస్తారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. అధికారులకు హోదా మార్పు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. దైవకార్యంలో పాల్గొంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. దంపతుల మధ్య అవగాహన లోపం. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఆదాయానికి మించి ఖర్చులు. రుణయత్నం ఫలించదు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. బంధువుల మాటతీరు మనస్దాపం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. నోటీసులు అందుతాయి. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఆది, సోమ వారాల్లో అనాలోచితంగా వ్యవహరించవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. శ్రమపడినా ఫలితం ఉండదు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
కన్య : ఉత్తర 2, 3 4 పాదాలు. హస్త, చిత్త 1, 2 పాదాలు.  
సంతోషకరమైన వార్తలు వింటారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళకువ వహించండి. స్తోమతకు మించి హామీలివ్వద్దు. గృహం సందడిగా ఉంటుంది. బంధుత్వాలు బలపడతాయి. పనులు హడావుడిగా సాగుతాయి. మంగళ, బుధ వారాల్లో ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి నెలకొంటుంది. ప్రియతములను కలుసుకుంటారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. నిర్మాణాలు, మరమ్మతుల చేపడతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖథ 1, 2 3 పాదాలు.  
వివాహ సంబంధాలపై దృష్టి పెడతారు. ఏజెన్సీలు, దళారులను విశ్వసించవద్దు. ఆర్థికంగా ఫర్వాలేదనిపస్తుంది. బాకీల వసూలువుతాయి. ఖర్చులు సామాన్యం. పెద్ద మొత్తం ధనసాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. గురు, శుక్ర వారాల్లో పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. అవకాశాలు అనుభూతినిస్తాయి. గృహమార్పు కలిసివస్తుంది. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు ఇతరులకు వెల్లడించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట  
లౌక్యంగా వ్యవహరించాలి. మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పెద్దల సంహా పాటించండి. దంపతుల మధ్య అరమరికలు తగవు. శనివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం చదువులపై శ్రద్ధ అవసరం. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. ఉద్యోగస్తుల సమర్ధత అధికారులకే లాభిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణం చికాకు పరుస్తుంది.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం  
ఈ వారం ధనలాభం ఉంది. అవసరాలు నెరవేరుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. బాధ్యతలను ఇతరులకు అప్పగించవద్దు. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. భేషజాలు, పంతాలకు పోవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. నగదు, పత్రాలు జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాల ఊపందుకుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. విందులు, వేడుకల్లో మితంగా ఉండాలి. వాహనం ఇతరులకివ్వవద్దు. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు  
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఆర్థిక ఇబ్బంది లేకున్నా వెలితిగా ఉంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేటు సంస్ధల్లో మదుపు క్షేమం కాదు. పనులు ముందుకు సాగవు. మీ పై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సన్నిహితుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం స్ధిరంగా ఉంటుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలు, ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మునుముందు ఫలితమిస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. నిరద్యోగులకు ఉద్యోగయోగం. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
 
కుంభం: ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు  
గృహం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పొదుపు మూలక ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. సంప్రదింపులు ఫలిస్తాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తొలగి కుదుటపడతారు. పదవుల కోసం యత్నాలు సాగాస్తారు. మంగళ, బుధ వారాల్లో గుట్టుగా వ్యవహరించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. టెండర్లు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. అనుకున్నది సాధిస్తారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. గురు, శుక్ర వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. సంస్థల స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెడు స్వప్నాలు వస్తే ఏం చేయాలో తెలుసా?