Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18-08-2019 నుంచి 24-08-2019 వరకు మీ రాశి ఫలితాలు..

Advertiesment
18-08-2019 నుంచి 24-08-2019 వరకు మీ రాశి ఫలితాలు..
, శనివారం, 17 ఆగస్టు 2019 (18:17 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
పొదుపుకు ధనం అందుతుంది. ఖర్చులు భారం కావు. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసాయం తగదు. కొత్త పనులు ప్రారంభిస్తారు. కార్యం సిద్ధిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. పరిచయాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆది, గురు వారాల్లో ప్రత్యుర్థులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగాలి. ఆధపత్యం ప్రదర్శింవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. వ్యాపారాభివృ్ద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరకు నిల్వ తగదు. ఉద్యోగస్తులకు పదవీయోగం. వృత్తుల వారికి సామాన్యం. 
 
వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు.
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సన్నిహితుల సలహా పాటించండి. సోమ, మంగళ వారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సంతానానికి ఉన్నత విద్యాకాశం లభిస్తుంది. పట్టుదలతో ఉద్యోగయత్నం సాగించండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. త్వరలో శుభవార్త వింటారు. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు. 
ఖర్చులు అధికం, ప్రయోజనకరం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. శుభకార్య యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. పరిస్థిలు అనుకూలిస్తాయి. ఆందోళన తగ్గి కుదుడపడతారు. బుధవారం నాడు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా పడతాయి. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. గృహమార్పు చికాకు పరుస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనప్రాప్తి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. కాంట్రాక్టలు దక్కించుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. ప్రయాణం తలపెడతారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష.
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. వ్యవహారానుకూలత ఉంది. ప్రణాళికలు రూపొందుంచుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరుతాయి. గురు, శుక్ర వారాల్లో అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం స్ధిరంగా ఉంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సంస్థల స్ధాపనకు అనుకూలం. ఉద్యోగస్తులకు గుర్తింపు లభిస్తుంది.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితులు అనుకూలించవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. శని, ఆది వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. గృహమార్పు కలిసివస్తుంది. వ్యాపారాలు లభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
కొన్ని ఇబ్బందులు తొలగి కుదుటపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలుకు యత్నాలు సాగిస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో మెళకువ వహించండి. పత్రాలు, రశీదులు జాగ్రత్త. సోమ, మంగళ వారాల్లో పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆప్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, మధ్యవర్తులను నమ్మవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. వృత్తి ఉపాధి పథకాల్లో స్ధిరపడతారు. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వాహన చోదకులకు దూకుడు తగదు. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు.
గృహమార్పు కలిసివస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. బంధువుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు సామాన్యం. ధనలాభం ఉంది. పెట్టుబడులకు అనుకూలం. పత్రాలు సమయానికి కనిపించవు. బుధ, గురు వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఎవరినీ నిందించవద్దు. దంపతుల మధ్య అపోహాలు తొలుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఏజెన్సీలు దక్కించుకుంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట.
మీ నమ్మకం వమ్ముకాదు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. గృహంలో స్తబ్ధత తొలుగుతుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. సమస్యలకు తాత్కాలిక పరిష్కారం లభిస్తుంది. అంచనాలు ఫలిస్తాయి. పరిచయాలు బలపడతాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. శుక్ర, శని వారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. బంధుమిత్రులు ఒత్తడి అధికం. అనవసర బాధ్యతలు తీసుకోవద్దు. మీ ఇష్టాయిష్టాలను కచ్ఛితంగా తెలియజేయండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. లౌక్యంగా వ్యవహరించాలి. పట్టుదలకు పోవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ధన సమస్యలెదురవుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆది, మంగళ వారాలో పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, ధనప్రాప్తి. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. సరకు నిల్వలో జాగ్రత్త. నిర్మాణాలు వేగవంతమవుతాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. కోర్టు వ్యవహారాలు కొలక్కివస్తాయి.
 
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు.
సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రముఖుల సందర్శనం సాధ్యపడదు. ఆర్థికస్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఏ విషయం పై ఆసక్తి ఉండదు. ఖర్చులు సామాన్యం. అవసరాలకు ధనం అందుతుంది. బుధవారం నాడు పనులు ముందుకు సాగవు. మీ పై శకునాల ప్రభావం అధికం. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. స్వల్ప అస్వస్థతకు గురువుతారు. అతిగా ఆలోచింపవద్దు. విశ్రాంతి అవసరం. గృహమార్పు నిదానంగా కలిసివస్తుంది. పెట్టుబడులకు అనుకూలం కాదు. ఉద్యోగస్తులకు ఒత్తడి, పనిభారం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. విద్యార్థులు విజయం సాధిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు.
ఈ వారం అనుకూలదాయకం. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. చిత్తశుద్ధిని చాటుకుంటారు. మీ పై వచ్చిన నిందలు తొలగిపోగలవు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన మంచిది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. సంతానానికి విదేశీ విద్యావకాశం లభించే ఆస్కారం లేదు. ప్రకటనలు, బోగస్ సంస్ధలను విశ్వసించవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి.
అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం స్ధిరంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. సేవా సంస్ధలకు సాయం అందిస్తారు. కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. కలిసివచ్చిన అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. పరిచయం లేని వారితో జాగ్రత్త. కొంత మంది మీ నుంచి సమాచార సేకరణకు యత్నిస్తారు. ఇంటి విషయాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. గృహ మార్పు అనివార్యం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ప్రయాణం తలపెడతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి భక్తులకు శుభవార్త.. స్వామివారి 1296 రకాల ఆభరణాలను ఇలా చూడొచ్చు..?