బుధవారం ఆకుపచ్చ దుస్తులు.. పెసరట్టును మరిచిపోవద్దు... (video)

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (05:00 IST)
ఆదిదేవుడైన గణపతిని ఆలయాల్లో దర్శించుకోవడం మంచిది. అందుచేత బుధవారం ఉదయం, సాయంత్రం సమయాన సమీపంలోని బొజ్జగణపతి ఆలయానికి వెళ్లి.. గజనాథుడిని దర్శించుకోవడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా బుధవారం రోజున గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించి గరికను సమర్పించడం ద్వారా ఉన్నత ఫలితాలను పొందవచ్చునని పండితులు చెబుతున్నారు.  
 
బుధవారం ఆకుపచ్చ దుస్తులు ధరించడం శ్రేయస్కరం. ఆకుపచ్చ దుస్తులు ధరించడం ద్వారా చేపట్టిన కార్యాలు విజయవంతమవడంతో పాటు, శుభ ఫలితాలు చేకూరుతాయి. అదేవిధంగా... స్త్రీలు బుధవారం నాడు ఆకుపచ్చ రంగు పువ్వులు అంటే సంపంగి వంటివి తలలో ధరించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుంది.
 
అలాగే బుధవారం రోజున పెసల పప్పుతో చేసిన వంటలు అంటే పెసరట్లు, పెసరపప్పు పచ్చడి, పెసలతో చేసిన హల్వా, లడ్డు వంటి పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా చింత, సీమచింత పండ్లు స్వీకరించడం కూడా శ్రేయస్కరమని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమారుడు కావాలన్న కోరికతో కుమార్తెను హత్య చేసిన తల్లి

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు : ఎమ్మెల్యే శిరీషా దేవి

ప్రాణ స్నేహితుడు చనిపోయినా నాకు బుద్ధిరాలేదు... యువకుడు ఆత్మహత్య

ఆమ్రపాలి కాటకు పదోన్నతి... మరో నలుగురికి కూడా...

ప్రేమ, అక్రమ సంబంధం.. ఆపై బ్లాక్‌మెయిల్.. యువకుడిని చంపేసిన అక్కా చెల్లెళ్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

26-12-2025 శుక్రవారం ఫలితాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

25-12-2025 గురువారం ఫలితాలు - స్థిరాస్తి ధనం అందుతుంది.. తాకట్టు విడిపించుకుంటారు...

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - ధనుస్సుకు అర్దాష్టమ శని ప్రభావం ఎంత?

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - వశ్చిక రాశికి వ్యయం-30

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం: టిటిడి చైర్మన్ ఏం చెప్పారంటే?

తర్వాతి కథనం
Show comments