Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శనివారం ఏకాదశి విశిష్టత.. చేయకూడని పనులు.. తేనెను తినకూడదట..? (video)

Advertiesment
శనివారం ఏకాదశి విశిష్టత.. చేయకూడని పనులు.. తేనెను తినకూడదట..? (video)
, శనివారం, 29 ఆగస్టు 2020 (05:00 IST)
Ekadasi
శనివారం ఏకాదశి విశిష్టత కూడినది. ఈ రోజున ఎర్రని ధాన్యాలను తీసుకోకూడదు. తేనే తినకూడదు. ఒంటిపూట మాత్రమే భోజనం చేయాలి. శనివారం వచ్చే ఏకాదశి రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించాలి. పసుపు రంగు పండు లేదా పసుపు వస్తువులను అందుబాటులో ఉంచాలి. దక్షిణ ముఖంగా ఉన్న శంఖంలో గంగా జలం నింపి విష్ణువు అభిషేకం చేయాలి. 
 
ప్రతినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి.
 
తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి. ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పండితులు చెప్తున్నారు. 
 
అలాగే శనివారం పూట వచ్చే ఏకాదశి రోజున తులసీని శ్రీవారి లేదా శ్రీ విష్ణువు పటం ముందు వుంచి పూజిస్తే.. వారికి శ్రీ వేంకటేశ్వర స్వామి కటాక్షం లభిస్తుంది. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. తులసీ అంటే శ్రీమహాలక్ష్మీ. అందుకే ఒక్క తులసీ దళాన్నైనా స్వామికి సమర్పిస్తే, పూజగదిలో ఒక్క తులసీదళాన్ని వుంచితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. 
webdunia
Tulasi
 
ఏకాదశి ఉపవాసం ఆరోగ్యాన్ని కాపాడి రోగాలు రాకుండా కాపాడుతూ, శారీరక పుష్టిని ఇస్తుంది. ఏకాదశి ఉపవాసం ఏలా చేయాలి అంటే దశమి రోజు రాత్రి వండిన వంటకాలను ఏమి తినకుండా పండ్లు, జ్యూస్ లాంటివి తీసుకోవాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి. ద్వాదశి నాడు ఉదయన అన్నం వండి దేవునికి నివేదన చేయాలి. అనంతరం భోజనం చేయాలి. దీన్ని పారణం అని కూడా పిలుస్తారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి కీర్తిని నలువైపులా వ్యాప్తి చేసేందుకు టిటిడి కీలక నిర్ణయం?