Publish Date: Thu, 03 Sep 2020 (05:00 IST)
Updated Date: Thu, 03 Sep 2020 (13:26 IST)
గురువారం అంటే గురుభగవానునికి ప్రీతికరమైన రోజు. గురువారం రోజున జామపండ్లను, శెనగలతో తయారుచేసిన పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఈ రోజున పసుపు రంగు దుస్తులను ధరించి ఈ స్వామివారికి పూజలు చేయడం వలన వీరి అనుగ్రహం దక్కుతుందని పురాణాలలో చెబుతున్నారు.
ఈ రోజున స్త్రీలు పసుపు రంగు పువ్వులు పెట్టుకుని స్వామివారిని ఆరాధించడం వలన సిరిసంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అలానే ఈ రోజు మామిడి, నిమ్మ, సపోటా పండ్ల జ్యూస్‌లను తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు. గురుభగవానునికి శెనగపిండితో తయారు చేసిన వంటకాలు నైవేద్యంగా సమర్పించడం వలన అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
గురువారం గురుభగవానుడిని ఆరాధించడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుంది.
వ్యాపారం, వృత్తిలో విజయం.
మనస్సుకు నచ్చిన వ్యక్తి భర్తగా లభిస్తాడు.
పాపాలు తొలగిపోతాయి.
ఉదర సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి.
దీర్ఘాయుష్షు చేకూరుతుంది.