Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం నేతి దీపం.. ప్రమిదలో కలకండను వేసి..?

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2021 (05:00 IST)
Ghee Lamp
నేతి దీపాన్ని శుక్రవారం పూట వెలిగించడం ద్వారా దేవతా అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అది కూడా ఆలయాల్లో నేతితో దీపం వెలిగించడం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయి. బ్రహ్మముహూర్తం, సంధ్యా సమయంలో నేతి దీపం వెలిగించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. 
 
అలాగే శ్రీ మహాలక్ష్మీ దేవికి నెయ్యి దీపం అంటే చాలా ప్రీతి. ఆమె అనుగ్రహం పొందాలనుకునేవారు.. గృహంలో బ్రహ్మముహూర్తంలో లేదంటే సూర్యోదయానికి ముందు నేతితో తొమ్మిది దీపాలను శుక్రవారం వెలిగిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. కుజ, రాహు దోషాలు తొలగిపోవాలన్నా.. అష్టైశ్వర్యాలు చేకూరాలన్నా శుక్రవారం పూట శ్రీలక్ష్మీ పటం ముందు నేతి దీపం వెలిగించడం విశేష ఫలితాలను ఇస్తుంది. 
 
ఈతిబాధలు, రుణబాధలు, కుటుంబంలో కలహాలు, దంపతుల మధ్య విబేధాలు.. ఇవన్నీ తొలగిపోవాలంటే.. శుక్రవారం శ్రీలక్ష్మికి గృహిణీలు నేతి దీపం పెట్టాలని మహర్షులు చెప్పిన పరిహారం ఇదేనని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. నేతితో ప్రమిదలో దీపం వెలిగిస్తే.. ఆ ఇంటిని వెతుక్కుంటూ శ్రీ మహాలక్ష్మి వస్తుందని విశ్వాసం. గ్రహదోషాలు తొలిగిపోతాయి. శుభం చేకూరుతుంది. ఆదాయం పెంపొందుతుంది. 
 
అలాగే శుక్రవారం చక్రతాళ్వార్ సన్నిధానంలో నేతి దీపం వెలిగించి 12 సార్లు ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇలా 48 రోజుల పాటు చేసినట్లైతే వ్యాపారాభివృద్ధి వుంటుంది. పితృదోషాలున్నవారు.. అమావాస్య రోజున నేతి దీపం వెలిగించి.. శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజిస్తే పితృదోషాలు తొలగిపోతాయి. శుక్రవారం నవగ్రహాల్లో శుక్రుడికి ప్రమిదలో కలకండను వుంచి.. నెయ్యి దీపం వెలిగిస్తే.. దంపతుల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అన్నీ చూడండి

లేటెస్ట్

2025 మేషరాశి వారికి విద్యావకాశాలు ఎలా వుంటాయంటే?

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వివరాలు

25-11 - 2024 సోమవారం వారం ఫలితాలు - రుణ సమస్యలు పరార్

చెప్పులున్నవాడి వెనక అప్పులున్నవాడి వెనక అస్సలు తిరగొద్దు: గరకపాటి వారి ప్రవచనం

2025 మహాలక్ష్మి రాజయోగం.... ఈ రాశులకు కనకవర్షమే!

తర్వాతి కథనం
Show comments