Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసంలో శివునికి నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే?

Webdunia
ఆదివారం, 25 నవంబరు 2018 (16:37 IST)
కార్తీక మాసంలో శివునికి అభిషేకం చేయించిన వారికి ఐశ్వర్యాలు, వంశాభివృద్ధి చేకూరుతుంది. కార్తీకమాసం శివకేశవులకు ప్రీతికరం. ఈ మాసంలో తులసీ పూజ చేయడం.. తులసీ మాల ధరించడం, ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం ద్వారా కోరిన కోరికలు నెరవేర్చుకోవచ్చు. అలాగే ఈ మాసంలో చేసే పూజలతో శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుడు సంతృప్తి చెందుతారని విశ్వాసం. 
 
శ్రీ మహా విష్ణువు అలంకార ప్రియుడైతే.. శివుడు అభిషేక ప్రియుడనే విషయం తెలిసిందే. అలాంటి శివునికి ప్రీతికరమైన కార్తీక మాసంలో అభిషేకం చేస్తే విశేష ఫలితాలు వుంటాయని పండితులు అంటున్నారు. అందుకే పాలతో కార్తీక మాసంలో శివునికి అభిషేకం చేయించిన వారికి సకల శుభాలు చేకూరుతాయి. పెరుగుతో అభిషేకిస్తే.. ఆరోగ్యం, ఆయుష్షు చేకూరుతుంది. 
 
నెయ్యితో అభిషేకం చేయడం ద్వారా సంతానం, తేనెతో అభిషేకం చేయడం వలన తేజస్సు లభిస్తాయి. కొబ్బరినీళ్లతో అభిషేకం చేయడం ద్వారా సంపదలు చేకూరుతాయి. మామిడి రసంతో శివునికి అభిషేకం చేస్తే ధనధాన్యాలు సమకూరుతాయి. నేరేడు పండు రసంతో శివునికి అభిషేకం చేయిస్తే.. ఉద్యోగ ప్రాప్తి, విజయాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

లేటెస్ట్

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న శ్రీశైలం

29-12-2024 ఆదివారం దినఫలితాలు -రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి...

శనివారం ప్రదోషం: సాయంత్రం పాలు, పెరుగు అభిషేకానికి సమర్పిస్తే?

Tirumala Facts: బంగారు గోపురం.. వైకుంఠం నుంచి నేరుగా కొండమీదకి దిగారట!

28-12-2024 శనివారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments