Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కార్తీక పౌర్ణమి నాడు తూర్పు దిశలో దీపం వెలిగిస్తే?

కార్తీక పౌర్ణమి నాడు తూర్పు దిశలో దీపం వెలిగిస్తే?
, బుధవారం, 21 నవంబరు 2018 (18:23 IST)
కార్తీక మాసం పవిత్రమైనది. అలాంటి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జ్వాలాతోరణం విశిష్టత గురించి తెలుసుకుందాం. శివకేశవులకు కార్తీక మాసం ప్రీతికరం. ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజున వెన్నెలకాంతులు పౌర్ణమి రోజున నిండుగా భూమిపైకి ప్రసరిస్తాయి. క్షీరసాగర మధనం సమయంలో శివుడు హాలహాలాన్ని గొంతులో వుంచుకుంటాడు. ఆ విష ప్రభావానికి శివుడు అస్వస్థతకు గురవుతాడు. 
 
అగ్ని స్వభావం కలిగిన ఆ విషయం నుంచి మహేశ్వరుడిని కాపాడాల్సిందిగా అమ్మవారు అగ్నిదేవుడిని ప్రార్థించింది. ఇలా అనేక సపర్యల అనంతరం శివుడు కోలుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి. అలా అగ్నిస్వభావం వున్న కృత్తికా నక్షత్రానికి పార్వతీదేవి కృతజ్ఞతగా కార్తీక పార్ణమి నాడు జ్వాలాతోరణం ఏర్పాటు చేసిందంటారు. అందుకే కార్తీక పౌర్ణమి రోజున తమ శక్తికొలది దానాలు చేస్తే మోక్షం సిద్ధిస్తుందని మార్కండేయ పురాణం చెప్తోంది. 
 
కార్తీక పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్త కాలంలోనూ సాయంత్రం సంధ్యా సమయంలో దీపాలను వెలిగించడం ద్వారా సకలశుభాలు చేకూరుతాయి. కార్తీక పౌర్ణమి రోజున ఇంటి ముంగిట రంగవల్లికలతో అలంకరించి.. ఐదు దీపాలను వెలిగించాలి. కార్తీక పౌర్ణమి రోజున రెండు వత్తులతో దీపమెలిగిస్తే.. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మూడు వత్తులతో దీపం వెలిగిస్తే సంతాన ప్రాప్తి చేకూరుతుంది. 
 
నాలుగు వత్తులో దీపమెలిగిస్తే.. సర్వదోషాలు తొలగిపోతాయి. సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. అలాగే తూర్పు దిశగా దీపమెలిగించడం ద్వారా కుటుంబంలో ఐక్యత చోటుచేసుకుంటుంది. పడమర- రుణాలు తొలగిపోతాయి. ఉత్తరం- వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. కానీ దక్షిణం వైపు మాత్రం దీపాలు వెలిగించకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్తీక పౌర్ణమిని ఎప్పుడు జరుపుకోవాలి.. నవంబర్ 22న లేదా 23వ తేదీనా?