Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్వదుఃఖాలను పోగొట్టే శనిమహాప్రదోషం

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (22:07 IST)
lord shiva
సర్వదుఃఖాలను పోగొట్టే శనిమహాప్రదోషం (సెప్టెంబర్ 18)న వస్తోంది. శనివారం వచ్చే ప్రదోషం రోజున శివాలయాన్ని దర్శించుకుంటే ఐదు సంవత్సరాల పాటు ప్రతిరోజూ శివాలయం వెళ్లిన పుణ్యం దక్కుతుంది. సాధారణ ప్రదోషాల కంటే శనివారం వచ్చే మహా ప్రదోషం మహిమాన్వితమైంది. 
 
ఈ రోజున మహాదేవుడిని, శనీశ్వరుడిని వ్రతమాచరించి పూజించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. దేవతలను రక్షించడం కోసం పరమేశ్వరుడు విషాన్ని సేవించిన రోజు శనివారం. ఆ సమయం ప్రదోష సమయం. ఆ రెండూ కలిపి వచ్చే శని ప్రదోషం రోజున పరమేశ్వరునికి అభిషేకాది పూజలు చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.   
 
శనివారం పూట శివాలయాల్లో పంచాక్షరీ మంత్రాన్ని పఠించడం ద్వారా ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి. అందుకే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు ప్రదోష కాలాన పఠిస్తే సర్వం సిద్ధిస్తుంది. అందుకే శని ప్రదోషం రోజున శివుడిని దర్శించుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. 
 
అంతేకాకుండా శని ప్రదోషం రోజున శివునికి అభిషేకం అలంకారాలతో పాటు నైవేద్యంగా పెరుగన్నాన్ని సమర్పిస్తే సర్వం శుభం. ఈ పెరుగు అన్నాన్ని ఆలయానికి వచ్చే భక్తులకు ప్రసాదం ఇవ్వడం చేస్తే అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. కార్యసిద్ధి, విజయాలు వరిస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments