Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శనివారం "మహాప్రదోషం" మహిమాన్వితమైనది...

శనివారం
, శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (23:19 IST)
శనివారం వచ్చే ప్రదోషాన్ని "మహాప్రదోషం" మహిమాన్వితమైనది. శనివారం 4 సెప్టెంబర్‌న మహా ప్రదోషం. ఈ రోజున ఈశ్వరుడిని స్తుతించడం మరిచిపోకూడదు. ప్రదోష సమయాల్లో ఇతర దేవతల సాన్నిధ్యం కొరకు వేరే ఆలయాలకు పోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు సాయంత్రాన శివాలయాల్లో జరిగే నందీశ్వర అభిషేకాలను కళ్ళారా దర్శించేవారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు అంటున్నారు. 
 
అదీ శనివారం వచ్చే ప్రదోషాన్ని "మహాప్రదోషం" అంటారు. ఆ రోజున శివపరమాత్మను ప్రదోష కాలంలో దర్శించుకుంటే మోక్షమార్గాలు, పుణ్యఫలాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.
 
దోషాలను హరించే ప్రశస్తమైన కాలాన్ని ప్రదోషకాలం అంటారు. సూర్యుడు అస్తమించే సమయంలో తిథి మారితే అది ప్రదోషకాలం. ప్రదోషకాలం రాత్రికి ప్రారంభం వంటిది. ఆ సమయంలో పార్వతితో కలిసి పరమేశ్వరుడు, అర్థనారీశ్వరునిగా అతిప్రసన్నుడై దర్శనమిస్తాడు. 
 
శనివారం, త్రయోదశి, ప్రదోషం మూడూ కలిస్తే అవి శుభఘడియలుగా పరిగణించవచ్చు. గ్రహపీడా నివారణకు, శని ప్రభావంతో ఇక్కట్ల పాలవుతున్నవారికి శని ప్రదోషసమయం దైవానుగ్రహ కాలంగా పరిగణిస్తారు. 
 
ప్రదోషకాలం అంటే ఏమిటి, ప్రదోష వ్రతాన్ని ఎలా చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం..
మనము రోజూ ఎన్నో పాపకర్మలు చేస్తుంటాము. వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకుని, మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే, దానికి తగ్గ పుణ్యకర్మలు చేయాలి. ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము.
 
ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండురూపాల్ని ప్రదర్శిస్తూ... ఎడమభాగాన పార్వతి, రెండవ భాగమున పరమేశ్వర రూపంగా "అర్థనారీశ్వరుడుగా" దర్శనమిచ్చేకాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

03-09-2021 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని ఎర్రని పూలతో పూజించినా...