Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రావి, జమ్మి, అరటి చెట్లను పూజిస్తే..?

Advertiesment
రావి, జమ్మి, అరటి చెట్లను పూజిస్తే..?
, బుధవారం, 1 సెప్టెంబరు 2021 (20:01 IST)
ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఐదు చెట్లు ఆరాధనకు యోగ్యమైనవి పరిగణించారు. ఈ ఐదు వృక్షాలను పూజించటం ద్వారా సంపన్న జీవనం గడుపవచ్చు. ఇందులో మొదటిది తులసి మొక్క విష్ణువుకు ప్రీతికరమైందిగా పరిగణిస్తారు. ఇది లక్ష్మీ దేవి రూపంగా భావిస్తారు. 
 
తులసి చెట్టు కింద రోజూ నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. లక్ష్మీ దేవి కూడా సంతృప్తి చెందుతుంది. తులసి మొక్కకు రోజూ క్రమం తప్పకుండా నీటిని అందించాలి. అయితే ఆదివారం మాత్రం తులసికి నీరును పోయకూడదని చెప్పబడింది. అంతేకాకుండా ఏకాదశి తిథిన తులసి ఆకులను తుంచడం కానీ, తీయడం కానీ చేయకూడదు.
 
శాస్త్రాల్లో జమ్మి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి రోజూ సాయంత్రం జమ్మి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా మీ ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా వ్యాపారం కూడా పూరోగమిస్తుందని విశ్వసిస్తారు. ప్రతి రోజూ సాయంత్రం ఇంటి దేవాలయంలో సంధ్యా వందనం ముగిశాక కచ్చితంగా జమ్మిచెట్టు కింద దీపాన్ని వెలిగించడం. ఇంటి నుంచి బయటకు వెళ్లే దిశలో బయట జమ్మి చెట్టును నాటాలి. 
 
ఈ స్థలం ఎల్లప్పుడు శుభ్రంగా, చక్కగా ఉంచుకోవాలి. శనివారం లేదా విజయదశమి రోజు వర్తింపజేయడం ఉత్తమం. ప్రతి శనివారం జమ్మిచెట్టు కింద ఆవ నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల శని నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
 
ఇకపోతే.. పితృదేవతలు రావిచెట్టుపై నివసిస్తారని, దీన్ని ఆరాధించడం ద్వారా మన ప్రార్థనలు నేరుగా చేరుతాయని చెప్తారు. రావి చెట్టుపై ప్రతి శనివారం దీపాన్ని వెలిగించాలి.  
 
వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ చాలా ప్రత్యేకమైందిగా భావిస్తారు. కనిపించేంత అందంగా ఉండటమే కాకుండా పాజిటీవ్ ఎనర్జీని ఇస్తుందని విశ్వాసం. అలాగే అరటి చెట్టును గురువారం ఆరాధించడం ద్వారా చాలా పవిత్రంగా భావిస్తారు. 
 
అరటి చెట్టును ఆరాధించడం వల్ల శ్రీహరి కూడా సంతృప్తి చెందుతాడని నమ్ముతారు. ప్రతి గురువారం మినపప్పు, బెల్లంతో అరటి చెట్టును పూజిస్తారు. గురువారం ఉపవాసం పాటించేవారు అరటి చెట్టును పూజించి నీటిని అర్పిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి ధనప్రసాదం, ఎలా తీసుకోవాలంటే..?