దేవతలకు అనేక రకాల నూనెలతో దీపాలను వెలిగించడం చూస్తుంటాం. అలాంటి వాటిలో పిండి దీపం కూడా ఒకటి. ఈ పిండి దీపాన్ని శ్రావణ మంగళ, శుక్రవారాల్లో వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం పొందవచ్చు. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	బియ్యం, బెల్లం, పంచదార, యాలకులు వంటివి చేర్చి పిండిగా సిద్ధం చేసుకుని దీపంలా తయారు చేసుకుని అందులో నేతితో దీపం వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అనుకున్న కార్యాలు సిద్ధించాలంటే.. కోరిన కోరికలు నెరవేరాలంటే.. పిండి దీపాన్ని శుక్రవారం పూట వెలిగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
									
										
								
																	
	 
	అలాగే శ్రావణ శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగించడం విశేషం. శనివారం స్వామిని పూజించేవారు బియ్యం పండితో చేసిన ప్రమిదలతో పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. ఇలా చేస్తే ఈతిబాధలుండవు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ పిండి దీపం వెలిగించేటప్పుడు శ్రీలక్ష్మీ నారాయణులను స్తుతించడం మరిచిపోకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.