Webdunia - Bharat's app for daily news and videos

Install App

2025లో శనిగ్రహ మార్పు... ఈ ఐదు రాశులకు అంతా అనుకూలం..

సెల్వి
శుక్రవారం, 29 నవంబరు 2024 (20:19 IST)
Shani Gochar 2025
శనిగ్రహ గోచారం (మార్పు) వల్ల 2025వ సంవత్సరం కొన్ని రాశులకు లాభాలు చేకూరుతాయి. వచ్చే ఏడాది మార్చి 29న కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్న శనీశ్వరుడు రెండున్నర ఏళ్లపాటు కొన్ని రాశులకు కష్టనష్టాల నుంచి విముక్తి కలిగిస్తాడు. 
 
ఈ మార్పు వల్ల ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని వంటి శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ మార్పుతో వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశులు లాభపడుతాయి. ఈ రాశుల వారికి ఆదాయ వృద్ధి, ఆరోగ్యం, ఉద్యోగంలో పురోగతి వుంటుంది. ఈ శని స్థానం మారటం వల్ల వృషభ రాశివారికి శని లాభ స్థానంలోకి వస్తున్నందువల్ల రెండున్నర ఏళ్ల పాటు జీవితంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. 
 
అలాగే తుల రాశి వారికి అనుకూలం. ఇప్పటి వరకూ పంచమ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు ఆరవ స్థానమైన మీన రాశిలోకి మారడం వల్ల ఉద్యోగంలోనూ, వృత్తి, వ్యాపారాల్లోనూ తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందడం జరుగుతుంది.
 
వృశ్చిక రాశివారికి శని పంచమ స్థానంలోకి మారడంతో అర్ధాష్టమ శని నుంచి విముక్తి లభిస్తుంది. దీంతో ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి.  
 
మకరరాశి వారికి శని స్థానమార్పుతో శుభం కలుగుతుంది. ఇంత కాలంగా ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న శని మూడవ స్థానానికి మారుతున్నందు వల్ల ఈ రాశివారికి ఏడున్నరేళ్ల శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments