Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2025లో మేషం, వృషభం, మిథున రాశి దర్శించాల్సిన పరిహార స్థలాలేంటి?

2025 Auspicious important temples

సెల్వి

, బుధవారం, 27 నవంబరు 2024 (18:43 IST)
2025 Auspicious important temples
12 రాశులకు శుభాలను ప్రసాదించే దేవాలయాలను గురించి తెలుసుకుందాం. అదీ ముఖ్యంగా 2025లో 12 రాశుల వారు దర్శించుకోవాల్సిన ఆలయాల సంగతికి వస్తే.. తమిళనాడులోని కుంభకోణం, కాంచీపురం జిల్లాల్లో వున్న ప్రముఖ ఆలయాల్లో 12 రాశుల వారు చేయాల్సిన పరిహారాలను, సందర్శించాల్సిన ఆలయాలను గురించి తెలుసుకుందాం. 
 
కుంభకోణంలో 12 రాశుల వారు సందర్శించాల్సిన ఆలయాలు.. ముందుగా మేషం, వృషభం, మిథున రాశి వారు సందర్శించాల్సిన ఆలయాల గురించి తెలుసుకుందాం.. 
 
మేషం: కుజ ఆధిపత్యం కలిగిన మేషరాశి వారు కుంభకోణంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించాలి. ఈ ఆలయం రామానుజుని గురువైన పెరియ నంబికి వరద రాజ పెరుమాళ్ మోక్షాన్ని ప్రసాదించిన స్థలం. 
 
వచ్చే 2025లో శని పరివర్తనం జరగడం వల్ల మేష రాశిలో వచ్చే అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలకు సంబంధించి శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో చేసే దోష పరిహారాల్లో పాల్గొనడం మంచిది. నక్షత్రాలకు 24 నక్షత్రాలకు ఈ ఆలయంలో శని దోష పరిహారాలు చేస్తారు. 
 
వృషభం: శుక్ర గ్రహాధిపతి అయిన వృషభ రాశి జాతకులు కుంభకోణంలోని కోమలవల్లి తాయారు సమేత సారంగపాణి ఆలయం.. పెరుమాళ్ల వారి 108 దివ్యదేశాల్లో మూడోవదిగా పరిగణించబడుతోంది. ఇంకా మహాలక్ష్మీ దేవి ఇక్కడ కొలువై వుండటం వల్ల వృషభ రాశి జాతకులు దోష నివారార్థం ఈ స్థలాన్ని సందర్శించడం మంచిది. ఈ ఆలయంలో పెసర పప్పు, బెల్లం, నెయ్యితో చేసిన పదార్థాన్ని ప్రసాదంగా అందిస్తారు. 
 
మిథునం: బుధాధిపత్య రాశి అయిన మిథునంకు చెందిన జాతకులు శ్రీ నారాయణ స్వామిని అధిదేవతగా భావిస్తారు. ఈ ఆలయం కుంభకోణంలో రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం వుంది. ఈ ఆలయం పేరు శ్రీ చక్రపాణి దేవాలయం. నవగ్రహాలకు నాయకుడైన సూర్యుడు ఇక అధిదేవతగా కొలువై వుంటాడు. నవగ్రహ దోషాలను నివృత్తి చేసుకునేందుకు ఈ ఆలయాన్ని సందర్శించడం మంచిది. సకల దోషాలు ఈ స్వామిని దర్శించుకోవడం ద్వారా మిథున రాశికి శుభాలను ప్రసాదిస్తాయి. 
webdunia
Temple
 
శివునికి ప్రీతికరమైన బిల్వ పత్రాలతో ఈ ఆలయంలోని మూల విరాట్టు చక్రపాణికి అర్చన చేయడం ఆనవాయితీ. చక్రం పోలిన తామర పువ్వులో, అష్ట ఆయుధాలతో ఈ స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. శ్రీమన్నారాయణ స్వామిని మిథునరాశికి చెందిన మృగశిర (3,4 పాదాలు), పునర్వసు 1,2,3 పాదాలు, ఆరుద్ర 3,4 పాదాలు గల జాతకులు కుంభకోణంలోని చక్రపాణి ఆలయంలో పూజలు చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీనరాశి ఉద్యోగ జాతకం 2025.. చన్నా దాల్, పసుపు ఆవాలు..?