Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతకంలో కుజదోష నివారణకు ఏం చేయాలంటే? (video)

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (05:00 IST)
జాతకంలో కుజదోషం వుందంటే చాలు.. జనాలు జడుసుకుంటారు. ముందుగా కుజ దోష నివారణకు పరిహారం కోసం పాకులాడుతుంటారు. పెళ్లి కావలసిన వారికి కుజదోషం వుందంటే ఇక ఆ తల్లిదండ్రులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కుజదోష నివారణకు గాను వారు వెళ్లని ప్రదేశం గానీ, చేయని ప్రయత్నంగాని వుండవు. అయితే కుజదోషం వలన కలిగే విపరీతాల నుంచి బయటపడాలంటే మంగళచండీ దేవిని పూజించాలని బ్రహ్మవైవర్త పురాణం చెప్తోంది.
 
కుజుడికి మంగళుడు అనే పేరు కూడా వుంది. మంగళవారం రోజున మంగళుడు పూజించిన కారణంగా ఆ తల్లి మంగళ చండీగా ప్రసిద్ధి చెందింది. మంగళుడి ఇష్టదైవాన్ని ఆరాధించడం వలన ఆయన కూడా తొందరగా అనుగ్రహిస్తాడు.
 
ఇక మంగళుడే కాదు … సాక్షాత్తు పరమశివుడు కూడా ఆమెను ఆరాధించాడు. మంగళవారం రోజున ఉపవాస దీక్ష చేపట్టి, మంగళ చండీని పూజించవలసి వుంటుంది. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. సమస్త దోషాలు తొలగిపోయి, శుభాలు చేకూరతాయి. ఇంకా కుటుంబ సంక్షేమం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. 
 
త్రిపురాసుర సంహారానికి ముందు తొలుత మంగళచండీని పూజించినవాడు శివుడు. ఆపై అంగారక గ్రహం, ముచ్చటైన మూడవ మంగళ పూజను మహేంద్రుడూ, నాలుగో పూజను దేవతలూ చేశారు. ఈ పూజ చేసిన వారికి శత్రుభీతి తొలగిపోతుంది. బ్రహ్మదేవుడు స్వయంగా శివునికి ఉపదేశించిన పూజ విధానం శ్రీ దేవి భాగవతంలో ఉంది.
 
మంగళ చండి స్తోత్రంను మంగళవారం పఠిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మంగళవారం కుజహోరలో దేవికి నేతితో దీపమెలిగించి ఈ మంత్రాన్ని పఠిస్తే వ్యాపారాభివృద్ధి, ఆర్థిక వృద్ధి చేకూరుతాయని పండితులు అంటున్నారు.
 
శత్రు పీడలు, రుణభాదలు, వాహన ప్రమాదాల నుండి రక్షణ, కోర్టు సమస్యలు, సంసారంలో గొడవలు, అనారోగ్య సమస్యలు, కోపం, అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ మొదలగు కుజ గ్రహ దోషాలకు మంగళ చండీ స్తోత్ర పారాయణం ప్రతి మంగళవారం పఠించటం మంచి ఫలితాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక నిపుణులు సెలవిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

04-06-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతితో అకారణ కలహం...

తర్వాతి కథనం
Show comments