Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శనీశ్వరునికి రోహిణి నక్షత్రం రోజున నువ్వుల నూనెతో అభిషేకం చేయిస్తే? (video)

శనీశ్వరునికి రోహిణి నక్షత్రం రోజున నువ్వుల నూనెతో అభిషేకం చేయిస్తే? (video)
, శుక్రవారం, 5 జూన్ 2020 (20:06 IST)
Lord Shani
శనీశ్వరుడి అనుగ్రహం కోసం.. శనిదోషాలు తొలగిపోవాలంటే శనివారం పూట శివాలయంలోని శనీశ్వరుని చుట్టూ నువ్వులతో దీపం వెలిగించి ప్రదక్షణలు చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

అలాగే శనీశ్వరుడిచే కలిగే అష్టమ, అర్దాష్టమ, ఏలినాటి శని నుంచి తప్పించుకోవాలంటే.. వారి వారి జన్మ నక్షత్రం రోజున లేదంటే శనిభగవానుడు పుట్టిన నక్షత్రం అయిన రోహిణి నక్షత్రం నాడు ప్రతి నెలా లేదా శనివారాల్లో అర్చన చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.

ఆ రోజుల్లో శనిభగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించడం శనిదోషాలను నివృత్తి చేస్తుంది. అలాగే నువ్వుల అన్నం, వడమాలను తయారు చేసి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆపై వడలను పేదలకు దానం చేయొచ్చు.
 
అలాగే శనిభగవానుడి శాంతి కోసం నవగ్రహ హోమాలు చేయించడం.. నువ్వులను శుభ్రం చేసి.. వేయించి ఏలకులు పొడి చేరి దంచుకుని తిలచూర్ణం చేసి శ్రీ వేంకటేశ్వరునికి, శనీశ్వరుడికి నైవేద్యంగా సమర్పించి పేదలకు దానం చేస్తే శని దోషాలుండవు. ఈతిబాధలు తొలగిపోతాయి. ఇంకా ఒక్కో శనివారం ఉపవాసముండి.. కాకి అన్నం పెట్టి పేదలకు వస్త్రాలు, అన్నదానం చేస్తే శనిభగవానుడి అనుగ్రహం లభిస్తుంది. 
webdunia
sesame oil lamp
 
శనివారం పూట నువ్వుల నూనెను రాసుకుని అభ్యంగన స్నానమాచరించి.. చిన్నపాటి వస్త్రంలో నువ్వులుంచి మూటలా కట్టుకుని.. నువ్వులనూనెతో శనీశ్వరునికి దీపం వెలిగించాలి. నిష్ఠతో శని కవచం లేకుంటే శని గాయత్రి జపం చేయాలి.

నైవేద్యం చేసిన తర్వాత కాకికి నువ్వులు కలిపిన అన్నం పెట్టి.. ఆపై భోజనం చేయాలి. ఇలా చేస్తే ఏలినాటి శని, జన్మ శని, అర్ధాష్టమ, అష్టమ శని దోషాలు తొలిగిపోతాయి. ఇంకా శనీశ్వరుని అనుగ్రహంతో శుభఫలితాలు ఏర్పడతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూన్ 11 నుంచి శ్రీవారి దర్శనం.. తలనీలాలు, పుణ్యస్నానాల్లేవు..