Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివునికి పాలాభిషేకం చేస్తే.. శనీశ్వరుడు అనుగ్రహిస్తాడట.. (video)

Advertiesment
Shani puja
, శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (15:52 IST)
శనీశ్వరుడిని శాంతింపజేయాలంటే.. శివునికి అభిషేకం చేయించాలని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. శనిదేవుడు కష్టనష్టాలకు కారకుడు. కానీ నిజానికి శని దేవుడు న్యాయాధికారి. అన్యాయంగా, అధర్మంగా ఆయన ఎవరినీ బాధించడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఆయా వ్యక్తుల కర్మ ఫలితాలను అనుభవించేలా మాత్రమే శనీశ్వరుడు చేస్తాడని వారు చెప్తున్నారు.
 
శనిదేవుడికి ప్రీతికరమైన పనులను చేయడం వలన, ఆయన తీవ్రత నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఆయన అనుగ్రహం కలిగితే పూర్తిస్థాయిలో శాంతిస్తాడు. శనిదేవుడికి ప్రీతికరమైన వాటిలో శివారాధన ఒకటిగా కనిపిస్తుంది.
 
శనివారం పూట శివునికి పాలాభిషేకం చేయించడం ద్వారా శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. రోజు లేదా వారానికి ఓసారి శివునికి అభిషేకం చేయించడం ద్వారా శని దోషాలకు దూరం కావొచ్చు. అందువలన శివలింగానికి అభిషేకం చేసి శనీశ్వర దోషాలను తప్పించుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
ముఖ్యంగా శనివారం పూట చక్కగా నీలిరంగు పుష్పాలతో పూజించి, శివారాధన, హనుమాన్, అయ్యప్ప ఆరాధనా చేయడం ద్వారా శనిదోషాలు తొలగిపోతాయట. శనీశ్వరుడితో కొద్ది ఇబ్బందులు ఎదురైనా అంతకు మించి ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎవరైతే శనీశ్వరుని భక్తిగా పూజించి, గౌరవిస్తారో అలాంటి వాళ్లను అనుగ్రహిస్తాడు. అయితే ఎప్పుడు కూడా శని పీడ రావాలనే కోరుకోవాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేవకపోతే.. ఏమౌతుందో తెలుసా?