Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

సెల్వి
శుక్రవారం, 1 ఆగస్టు 2025 (20:00 IST)
Pindi Deepam
శ్రావణ శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. శనిదోష నివారణ జరుగుతుంది. శ్రావణ శనివారం ఉదయం 5.30 గంటలకు లేదా సాయంత్రం 5.30 గంటల్లోపు పిండి దీపం వెలిగించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి. 
 
ఈతిబాధలు తొలగిపోతాయి. అనుకున్న కార్యాల్లో విజయం తథ్యం. ఉన్నత అవకాశాలు, పదవులు వరిస్తాయి. ఏలినాటి శనిదోషం తొలగిపోతుంది. సర్వాభీష్టాలు చేకూరుతాయి. కార్యానుకూలత లభిస్తుంది. అలాగే శనివారం నాడు శ్రీవారిని తలచి వేసే పిండి దీపాన్ని నైవేద్యంగా సమర్పించాక ప్రసాదంగా స్వీకరించాలి. 
 
శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతిని ఇలా వైకుంఠంగా భావిస్తారు. ఎంతో మంది భక్తులు ప్రతిరోజు ఇక్కడికి చేరుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం రోజున భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంకా శ్రావణంలో వచ్చే శనివారాల్లో ఆయనను స్తుతించడం ద్వారా జీవితం సుఖమయంగా మారిపోతుంది. 
 
పూజా సమయంలో స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు సమర్పించాలి. ఇక స్వామి వారికి పండ్లు, పాయసం చక్కెర పొంగలి, గారెలు పులిహార, కలకండ నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బియ్యం పిండితో తయారు చేసిన ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. 
 
పూజా సమయంలో "ఓం నమో నారాయణాయ" అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తూ వేంకటేశ్వరుడిని ఆరాధించాలి. ఆ తరుత స్వామీ వారికి కర్పూర హారతులు ఇచ్చి పూజ ముగించాలి. ఇలా శనివారం పిండి దీపంవెలిగించి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల స్వామివారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. ఇలా ఏడు వారాలు చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1.04 గిగావాట్ హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ. 7,500 కోట్లు మంజూరు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. కుక్కర్ల నుంచి లిక్కర్స్ వరకు.. పిల్లల్నీ వదిలిపెట్టలేదట

Aadudham Andhra: ఆడుదాం ఆంధ్రలో అవకతవకలు.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏడు అడుగుల ఎత్తున్న మహిళ.. షాకైన భక్తులు (Video)

39 ఫామ్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు.. డీజేలు, హుక్కా, మద్యం.. స్కూల్ స్టూడెంట్స్ ఎలా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Vishweshwara Vrat 2025: విశ్వేశ్వర వ్రతం ఎప్పుడు, ఆచరిస్తే ఏంటి ఫలితం?

Karthika Soma Pradosam: కార్తీక సోమవారం ప్రదోషం.. ఇలా చేస్తే అన్నీ శుభాలే

Prabodhini Ekadashi 2025: చాతుర్మాసం ముగిసింది.. ప్రబోధిని ఏకాదశి.. కదంబ వృక్షం పూజ చేస్తే?

క్షీరాబ్ది ద్వాదశి తులసి-దామోదర కళ్యాణం

01-11-2025 శనివారం దినఫలితాలు- బలహీనతలు అదుపులో ఉంచుకోండి

తర్వాతి కథనం
Show comments