స్త్రీలు గాజులు ధరించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహం పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. స్త్రీలు గోరింటాకు, మట్టి గాజులు ధరించడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. గాజుల శబ్దం నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని నమ్మకం. అలాగే శుక్రుని బలపరచడానికి గాజులు ఉపయుక్తంగా వుంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
గాజులు మణికట్టుకు మసాజ్ లాంటి ప్రభావం కలిగించి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. గర్భిణీలకు గాజుల శబ్దం శిశువు మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. భార్యాభర్తల అనుబంధాన్ని బలపరిచే శుభ చిహ్నంగా కూడా భావిస్తారు. అలాగే శ్రావణమాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం మంచిది.
ఆషాఢ మాసంలో తరహాలోనే శ్రావణంలోనూ గోరింటాకును పెట్టుకోవడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. గోరింటాకు పెట్టుకోవడం ద్వారా స్త్రీల గర్భాశయ దోషాలను తగ్గిస్తుంది.
అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు వుంటాయి. గోరింటాకును శ్రావణ, ఆషాఢ మాసాల్లో మహిళలు పెట్టుకోవడం ద్వారా భర్త ప్రేమ లభిస్తుందని పండితులు అంటున్నారు.