Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nag Panchami 2025: నాగపంచమి విశిష్టత.. ఇవి వాడకుండా వుంటే?

Advertiesment
Naga Panchami

సెల్వి

, సోమవారం, 28 జులై 2025 (16:07 IST)
Naga Panchami
నాగ పంచమి 2025లో ఈ పండుగ జూలై 29 మంగళవారం నాడు రాబోతుంది. ఈ రోజున సర్ప దేవతను భక్తిశ్రద్ధలతో పూజించటం, శివుడికి అభిషేకం చేయడం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నాగ పంచమి అనేది గ్రహశాంతి, దేవతా అనుగ్రహం పొందే దినంగా భావించబడుతుంది. 
 
సంప్రదాయాలను గౌరవిస్తూ.. నమ్మకాలపై విశ్వాసం ఉంచుతూ నాగ పంచమిని శుభదినంగా జరుపుకోవడం అనేది తరతరాలుగా కొనసాగుతున్న ఆచారమే. నాగ పంచమి అనేది సర్ప దేవతలకు అంకితమైన రోజు కనుక రాహువుతో సంబంధం ఉన్న ఇనుమును ఈ రోజున వాడకపోవడం ద్వారా ఆ గ్రహ ప్రభావాన్ని తగ్గించవచ్చని నమ్మకం ఉంది. 
 
రాహుతోపాటు శని గ్రహం కూడా ఇనుముతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రెండు గ్రహాల కలయిక జీవితంలో అనేక ఆటుపోటులను తెచ్చిపెడతాయని జ్యోతిష్యలు అంటున్నారు. అందుకే నాగ పంచమి రోజున ఇనుము వాడకం తగ్గించాలి. అలాగే నాగ పంచమి సందర్భంగా నాగులను దేవుళ్లగా భావించి పూజిస్తారు. 
 
పాముకి పాలు సమర్పిస్తారు. అలాగే ఈ రోజున మహిళలు తమ కుటుంబాన్ని రక్షించమని కోరుతో ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. అనంత, వాసుకి, శేష, పద్మ, కద్రు, తక్షక, కాలీయ, మణిభద్ర, శంఖపాల, అశ్వతార, ధృతరాష్ట్ర, శంఖచూడ అనే ఈ 12 రకాల పాములను నాగ పంచమి రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో పుజిస్తారు. 
 
నాగులు శక్తి, జ్ఞానం, సంపద , రక్షణకు ప్రతీకలుగా నమ్మకం. అనంత, వాసుకి, శేష, పద్మ, కద్రు, తక్షక, కాలీయ, మణిభద్ర, శంఖపాల, అశ్వతార, ధృతరాష్ట్ర, శంఖచూడ అనే ఈ 12 రకాల పాములను నాగ పంచమి రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?